వాగర్ధావివ సంయుక్త వాగర్థ ప్రతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర!!
ఈ సం||రం రాజు, సైన్యాధిపతి, అర్హాధిపతి, మేఘాధిపతి-కుజుడు. మంత్రి. బుధుడు. సస్యాధిపతి-శని. ధాన్యాధిపతి-గురుడు. రసాధిపతి-చంద్రుడు. నీరసా ధిపతి శుక్రుడు. ఈ నవనాయకులలో 4 ఆధిపత్యాలు శుభులకు, 5 ఆధిపత్యములు పాపులకు వచ్చుటచే పరిపాలన సజావుగా ముందుకు సాగదు. అధికార, ప్రతిపక్షముల మధ్య హోరా,హోరీగా మాటల యుద్ధం జరుగును. కేంద్ర రాష్ట్రముల మధ్య సత్సంబం ధాలు ఉంటాయి. కేంద్ర నిర్ణయములను రాష్ట్రం అమలుచేయును. రాష్ట్రంలో అభివృద్ధి కంటే సంక్షేమ పధకాలకే ప్రాముఖ్యత ఇస్తారు. అనేక నూతన పధకాలను ప్రవేశపేట్టుదురు. ప్రభుత్వంపై ప్రజలలో విశ్వసనీయత పెరుగును. పన్నుల విధానాల లోనూ అనేక మార్పులు ఉంటాయి. ఆర్ధికంగా ఇబ్బందులధికం. భారీగా ఋణాలు చేయుదురు. అభివృద్ధిరేటు తగ్గును. సరిహద్దు దేశములతో తగాదాలు, చీటికిమాటికి వచ్చును. శతృదేశమువారు కవ్వింపు చర్యలకు దిగుదురు. సైన్యం వాటిని చాకచక్యం తోత్రిప్పికొడతారు. పాకిస్థాన్ కు గడ్డుకాలమే. మిలటరీ పరిపాలన వచ్చును. ప్రపంచదేశా లలో మన దేశ ఖ్యాతి పెరుగును. కేంద్రంలో మంచిపరిపాలన అందిస్తారు
ఈ సం॥రం 2 కుంచములు వర్షం గాన భారతదేశమంతటా అన్ని రాష్ట్రము లందు సగటు వర్షపాతం నమోదగును. అల్పపీడనములు, ఋతుపవనముల వలన మంచి వర్షము కురియును. దక్షిణ రాష్ట్రములందు దక్షిణ ప్రాంతములందు అధికవర్షములు కురియును. ప్రకృతి వైపరీత్యములు అధికమే. ఎఱుపు నేలలు ఇసుక నేలలు బాగా పండును. పంటల దిగుబడి బాగుండుటచే ఆహార ధాన్యములు ఎగుమతిజరుగును. వరి,గోధుమ, మిర్చి, కందులు, పసుపు, శనగలు, కాయగూరలు సుగంధ ద్రవ్యములు, ప్రత్తి, చెరుకు, వేరుశనగ వేసిన రైతులకు మంచి లాభములు. ఈసం||రం కూడా రైతులకు కొంత నష్టం తప్పదు. మనరాష్ట్రంలో నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహించును. కొన్నిచోట్ల ప్రమాద సూచికలు దాటి ప్రవహించును. తీరప్రాంత గ్రామములు, ముంపుకు గురి అగును. ప్రభుత్వం వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సం||రం కూడా వడగండ్ల వర్షం, పిడుగులు పడుట అధికమే. జలాశయములలో నీరు సమృద్ధిగా ఉంటుంది. పండ్లతోటలకు నష్టం కలుగును. ఈసం॥రం 8వీసముల పంటఫలించును. పశుపాలకుడు, విడిపించువాడు యుముడే. దొడ్డి పెట్టువాడు శ్రీకృష్ణుడు గాన పాడి పరిశ్రమ బాగుండును. మూతపడిన డైయిరీలు తిరిగి నెలకొల్పుదురు. పాల ధరలు పెరుగును. పశుగ్రాసం ధరలు పెరుగును. రైతులకు అనేక రాయితీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించును.
ఈ సం||రం కూడా దేశములో వేసవిలో అత్యధిక, ఉష్ణోగ్రతలు నమో
దగును. రెండు తెలుగు రాష్ట్రములందు వేసవి తాపం అధికం. వడగాడ్పులు ఎక్కువగా వీచును. అత్యధికంగా అగ్నిప్రమాదాలు జరుగును. ధనప్రాణనష్టలు ఎక్కువగా ఉండును. ఉష్ణోగ్రతలు పెరిగినా త్రాగునీటికి ఇబ్బందులుండవు. వేసవిలో కొన్ని ప్రదేశములందు అకాల వర్షములు వల్ల పంటనష్టం కలుగును. పండ్లతోటలకు అధికంగా నష్టం జరుగును.విద్యుత్ ఉత్పత్తికి ఆటంకములుండవు.
ఆధాయ వ్యయ రాజపూజ్యావమానములు |