శ్రీ సరస్వతీమాత




 
మాఘశుద్ద పంచమిని శ్రీ పంచమిఅంటారు.అది. చదువుల తల్లి శ్రీ సరస్వతి పుట్టినరోజు.సకల విద్యా స్వరూపిణి,సకల వాఙ్మయానికి మూలకారకురాలు భాషా,లిపి,కళలకు అదిదేవత,వేదాలకు జనయిత్రి,సరస్వతి దేవి.
     వీణా పుస్తకదారినణి అయిన ఆతల్లి దయ ఉంటే,అమాయకుడు సైతం అత్యంత మేధావి అవుతాడు.మూర్కుడు సైతం విద్వాంసుడుగా మారిపోతాడు.ఆగ్రహిస్తే మహాపండితుడు కూడా వివేక శూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుంటాడు.
   మానవుడి ఉన్నత స్తానంలో నిలిపిన,వాక్కు,నాదం,గీతం,మొదలైనవన్నీ సరస్వతీదేవి స్వరూపాలు.అందుకే ఆతల్లినినాదస్వరూపిణిగా పేర్కొంటారు.వాక్కు,ప్రఙ్ఞ,మేధస్సు,స్పురణ,బుద్ది మొదలైన లక్షణాలు అన్నీ సరస్వతీదేవి అనుగ్రహ బలంతో లభిస్తాయి.సరస్వతీదేవి పుట్టినరోజంటే!మానవుడి ఔనత్యం పుట్టినరోజు అని భావించాలి.
   సరస్వతీ స్వరూపంలో గొప్ప తాత్విక,ఆద్యాత్మిక అంతరార్థాలు ఉన్నాయి.ఆమే ధరించినవాటియొక్క సంకేతాలను మనం గుర్తుంచుకోవాలి.ఆమె చేతిలోని 'జపమాల'పవిత్రతకు చిహ్నం.అందుకే సరస్వతీదేవిని"అక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణి"అని కొలుస్తారు.'చిలుక'తియ్యని పలుకులకూ,'పద్మం' సమస్తసంపదలకు,'పుస్తకం' సకల విద్యలకూ, కళలకూ చిహ్నాలు.
 ఆమె 'హంసవాహిని'పాలను నీటిని వేరుచేసి పాలను స్వీకరించే తత్వం హంసది.మనంకూడా యుక్తా యుక్తాలను,ఉచితానుచితాలను గమనించి,సముచితమైన పనులను మాత్రమే చేయాలని భావన.
   ఆమె'వీణాపాణి'ఆ వీణను'కచ్చపి' అంటారు.'వీణ' గాందర్వవేదమైన సంగీతానికి సంకేతం.కనుక ఆ తల్లిని పూజించిన వారికి"సుమధురమైనవి"లభిస్తాయి.అనిబ్రహ్మవైవర్త పురాణం,వ్రతచూడామణి,ధర్మ సిందూ,దేవీభాగవతంమొదలైన గ్రంధాలలో సరస్వతీదేవి అనుగ్రహ విశేషాలు సవివరంగా తెల్పినవి.
 శ్రీ పంచమి రోజున సరస్వతీదేవిని పుస్తకరూపంలో గాని,విగ్రహరూపంలో గాని పూజిస్తే సమస్త విద్యలు లభిస్తాయి.వాక్కు శుద్దికూడా అనుగ్రహిస్తుంది.సరస్వతీ,భారతి,శారద,హంస వాహినిగా పిలువబడే అమ్మకు మనదేశంలో పదకొండు ప్రసిద్దమైన దేవాలయాలు ఉన్నాయి.వ్యాసుడు పూజించిన సరస్వతీదేవి విగ్రహం "బాసర"లో వున్నది.
శ్రీపంచమినాడు పలక,బలపం,పెన్నులు,పుస్తకాలు,తీపిపదార్థాలను దానంచేయడంవలన వారి ఇంటిలో"నిరక్షరాస్యులు ఉండరు.అని పురాణాలు తెల్పినవి.అమ్మ అనుగ్రహం కొరకే పిల్లలకు అక్షరాభ్యాసం సరస్వతీదేవి సన్నిదిలో జరిపిస్తారు.
జై శ్రీ సరస్వతీ మాత

 ఈ వ్యాసం ప్రభోదమాలిక అనే పుస్తకం నుండి గ్రహించినది