8 వ సంక్యవారి పలితాలు
అంకె 8 – శని
ఆజ్ఞాపించే రాజు
8,17,26,తేదిలలో జన్మించిన వారు , తేది , నెల, సంవత్సరము కలుపగా 8 వచ్చ్చిన వారు 8 ఆదిక్యతతో జన్మించినవారు .
లక్షణాలు – స్వభావాలు
అష్ట దిక్కులు , అష్ట సిద్దులు , అష్ట వసువులు , అష్ట ఐశ్వర్యాలు , అష్ట లక్ష్ములు , జ్యోతిష్య శాస్త్రంలో లెక్కించే అష్ట వర్గులు , ఇలా ఎనిమిది అన్న అంకె ప్రాముఖ్యతను తెలిపే అంశాలు చాలా ఉన్నాయి .
వీరికి ఇతరులను ఆగ్నాపించే శక్తి ఉంటుంది . అన్ని నేర్చిన సుక్ష్మ బుద్ది వివేకాలు ఉన్నవారు . ఇంద్రియాలను అదుపులో పెట్టగలరు . ఎల్లప్పుడూ ఆలోచనలతో గడుపుతారు .
పలువురు ఈ అంకె అంటేనే భయపడతారు . కాని భయపడ వలసిన అవసరం లేదు . అంకెలన్నిటిలోను మంచి చేడులున్నాయి . ప్రతి అక్షరంలోనూ , గ్రహాలలోను మంచి చెడులున్నాయి . అవి కలసే స్తనాలను అనుసరించి సత్పలితాలు , దుష్పలితాలు ఏర్పడుతుంటాయి . వీరు తమకు అనుకూలమైన రంగును పొందినట్టే నామ సంక్యలు కుడా తమకు అనుకూలమైన ఇతర అంశాలకు అనుగుణంగా ఫలితాలనిస్తాయి .
ఈ అంకెకు చెందిన వారు అన్నిటిని పరిశీలించే స్వభావం ఉన్నవారు . వీరు ఎంగంలో అడుగుపెట్టినా తమ ఆదిక్యతను చాటుకుంటారు . వీరు ఇతరుల వలె సునాయాసంగా విజయం సాదించిన వారు కారు . తీవ్ర కృషి పలితంగా విజయం సాదించిన వారు . ఈ అంకె తీవ్రంగా పరీక్షించి అద్బుత కార్యాలను సాదించ గల శక్తిని ప్రసాదించ గలదు .
నిరంతర క్రుషివలులు . ఎల్లప్పుడూ సమస్యలతో పోరాటం సలుపుతారు . పెద్ద పదవులు నిర్వహిస్తున్నా బాధ్యతలను ఎక్కువగా మోస్తుంటారు . తరచుగా మనస్సులో ఆందోళనలు ఏర్పడి తొలగి పోతాయి . మేదోలక్షణం ఉంటుంది . ఏదో ఒక సమస్య మనస్సులో మెదులుతూ ఉంటుంది . [ చిరు ప్రాయం నుంచి మంచి స్నేహం , మంచి అలవాట్లు కలిగి ఉంటారు , పెద్దల [ గురువుల ] హిత బోదన అనుసరించి సమాజానికి హితం ఆచరిస్తారు] .
చెడు ఆలోచనలు వీరి మనస్సును ఆకర్షిస్తాయి . ప్రతిభకు తగిన ఫలితాలు రాక దుఃఖం కలుగుతుది . ఉత్తములుగా కీర్తింప బడతారు . సమర్డులుగా ఉంటారు .
కొందరు హేతువాద , తర్క రీత్యా మాట్లాడటం వలన వీరికి చిరకాల మిత్రులు అంటూ ఎవరు ఉండరు . ఒంటరిగా సమస్యలను ఎదుర్కొంటారు . ఎవరిని సులభంగా విస్వసించరు .
మారుతున్న ఆలోచనలతో మనస్సు ఉద్విగ్నమౌతుంది . పురాకృత ఖర్మ ఫలితాలను వీరిని ఎక్కువగా చుట్టుముడుతాయి . తత్వ రహస్యాలు ఎరిగిన వారఒఉతారు . మానవాతీత శక్తులను గ్రహించ గలరు . దివ్య గుణ సంపన్నులై ఉంటె రాజ సన్మానం లభిస్తుంది .
మంచి చెడులను బేరీజు వెయ గల శక్తి ఉంటుంది . జీవితంలో ప్రగతి సాదించాలన్న తపన ఉంటుంది . మనస్సులో ఎప్పుడు మొండితనం ఉంటుంది . దేనినైనా స్పష్టంగా బైట పెట్టగలరు . వ్యతిరేఖత ఉంటుంది . కాని వెనుకంజ వేయరు .
వీరి మాటలలో, చేతలలో తీవ్రత , ఖచ్చిత దోరణి ఉంటుంది . కార్య సాధకులు . బయటినుంచి చూస్తున్న వారికి దయా దాక్షిణ్యాలు లేని రాక్షసులన్పిస్తారు . కాని వాస్తవంగా చాలా మంచివారు .
తమ అర్హతకు మించి ఆశిస్తారు . ఆశను నేర వేర్చుకోవడానికి బృహత్ ప్రయత్నం చేస్తారు . విజయం సాదిస్తారు . ప్రపంచ జ్ఞానం కల వారు . సమయ సందర్బాలను సక్రమంగా ఉపయోగించుకొని లబ్ది పొందుతారు .
ఇతరుల దుఃఖం చూసి చలిస్తారు . పలు కళలను అద్యయనం చేస్తారు . కళా ఆరాధకులు . అన్నిటిలోనూ ఒంటరిగానే వ్యవహారం నడుపుతారు . ఇతరుల సలహాలతో కాక తమకు తాముగా మంచి నిర్ణయం తీసుకోగలరు . వాహన ప్రియులు . వీరు వాహనం నడపడం ఆకర్షనియంగా కన్పిస్తుంది . భయం లేని వారు .
ప్రేమతో, దయతో ప్రవర్తిస్తారు . ఒక పనికి పూనుకునే ముందు అనేక పర్యాయాలు ఆలోచిస్తారు . ఇతరుల విషయం లో అనవసంగా జోక్యం చేసుకోరు . కాని తమను గురించి ఎవరూ హీనంగా మాట్లాడ కూడదని భావిస్తారు . అలా మాట్లాడితే సహించరు .
కొన్ని సందర్భాలలో అనవసరంగా డబ్బును ఖర్చు పెడతారు . తర్వాత బాధ పడతారు . తమకంటూ ప్రత్యెక పద్దతులను అవలంబిస్తారు .సుఖ దుఖాలను తాముగా అనుభవిస్తారు . తమ లోపాలను చెప్పి ఎవరిని సాయం అడగరు . ఇతరులకు సాయం చేయడంలోనూ మంద గుణం ప్రవర్తిస్తారు .
8- వ అంకె సహజత్వానికి బిన్నమైన ఆలోచనలను , అనుభూతులను , ప్రేరేపించ గల కాంతి – శబ్ద శక్తులను కలది . తక్కిన అంకెలకు చెందిన వారికంటే తప్పుచేసిన వారిని ఎక్కువగా శిక్షించే గుణం ఉన్నవారు . కళల పట్ల ఆసక్తి కల వారు .
ఉన్నతమైన పవిత్రమైన ఆలోచనలు ఉన్నవారు . ప్రేమ , జ్ఞానం , దయ , వంటి ఉన్నత గుణాలు ఉంటాయి . ఇతరుల దుఃఖాన్ని తొలగిస్తారు . తమ క్రుషిచేత కీర్తి గడిస్తారు . గురువుల విషయం లో భక్తి శ్రద్దలు ప్రదర్శిస్తారు . పేదలపై దయ ఉంటుంది .
అవినీతి , అక్రమాలను వ్యతిరేకించి వాటిని పార ద్రోలుతారు . తప్పుచేసిన వారు ఎవరైనా ప్రశ్నిస్తారు . న్యాయాన్యాయాలను ఎరిగిన వారు . లౌక్యం ఉంటుంది . మనస్సులో ఆలోచనలు నిరంతరం పరిబ్రమిస్తుంటాయి గొప్ప శాస్త్ర వేత్తగా పరిశోధనా తపరులు గా ఉంటారు . దేహ సౌక్యంలో ఆసక్తి ఉంటుంది .
శాస్త్రాలు ఎరిగిన వారు . అనేక కళలను . తెలిసిన వారు . అంతర్గత జ్ఞానం కలవారు . కీర్తి కాంక్ష ఉంటుంది . ప్రజల మద్య గౌరవాబిమానాలు పొందగలరు . సంస్కర్తలుగా ప్రజానయకులుగా రాణించా గలరు .
దైవ భక్తులు . ఆచారాలను అనుసరిస్తారు . వైద్య , తత్వ , జ్యోతిష్య శాస్త్రాలలో రాణిస్తారు . గణిత శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది .
మంచి సాంకేతిక నిపుణులు యంత్ర నిర్మాణ దక్షులు , సిద్ద వైద్యులు , రసాయన శాస్త్రజ్ఞులు , సైనికులు , శాస్త్ర చికిత్సా నిపుణులు , కొత్త మందులను కనుగొనే వారు , విద్యుత్ కంప్యూటర్ , ఇంజనీరింగ్ మొదలైన వారు 8 – వ అంకెకు చెందిన పవిత్ర ఆదిక్యతతో జన్మించిన వారు .
ప్రక్యాతి గాంచిన సినిమా నటులు , నాట్యకారులు , శాస్త్ర వేత్తలు , రచయితలూ , కవులు , చాయా చిత్రకారులు , దర్శకులు , మేధావులు కూడా ఈ ఆదిక్యతలో జన్మించిన వారునారు .
సుశిక్షుతులైన సైనికుల వలె శ్రమిస్తారు . అలుపెరుగని కృషి వీరికి ప్రకృతి ప్రసాదించిన వరం .
వీరిని రెండు రకాలుగా విభజించ వచ్చును 1] పవిత్రమైన ఆదిక్యత కల వారు . సమాజానికి కావలసిన వారు . 2] చెడు ఆదిక్యత కల వారు .ఇతరులను వంచించి చట్ట వ్యతిరేఖ కార్య కలాపాలలో పాల్గొని జీవించే వారు .
వీరిలో 1. ఉన్నత స్తాయి వ్యక్తులు 2. నిమ్న స్తాయి వ్యక్తులని రెండురకాల వారున్నారు .
ఉన్నత స్తాయి వ్యక్తులు ఉన్నత సంస్కారంతో దాన గుణం కల వారు . ధర్మజ్ఞులు రాజకీయ రంగములో అద్బుత కార్యాలను ఆచరిస్తారు . సహజమైన సంబాషణ ద్వారా అందరిని ఆకర్షిస్తారు . ఆకర్షనీయ రూపంతో సంతోషంగా కన్పిస్తారు .
జీవితంలో పెద్ద సమస్యలకు లోనై బయట పడతారు . తత్వ శాస్త్రంలో నిష్ణాతులు కొందరు ప్రపంచ సుఖాలను త్యజించి సన్యాసం స్వీకరిస్తారు . మానవాతీత శక్తులను గురించి పరిసోదించే ఆసక్తి గల మనసున్న వారు . దివ్య శక్తులను గురించి గ్రహించిన వారు . . 8-వ అంకెకు ఆద్యాత్మిక మార్పులు , సద్గుణం తోడైతే గొప్ప కీర్తి గల వారౌతారు . మంచి పద్దతిలో సమకూరిన ఆదిక్యతలో జన్మించిన వారికి 8- వ అంకె అదృష్ట కరమైనది
తక్కిన అంకెల కంటే 8-వ అంకె గొప్ప విజయాలను ప్రసాదిస్తుంది .
శని మిక్కిలి శక్తీ గల అధిపత్యం ఉన్న గ్రాహం బాద్యత గలది . కటినమైనది . హక్కుల కోసం పోరాడే శ్రమ జీవి . ప్రకృతి పరిమాణాలను రక్షించ గలరు .
వీరు ఎక్కువ బాధ్యతలను , బరువులను కలిగి ఉంటారు . దేనినైనా బేరీజు వేసుకునే గుణం కలిగి ఉంటారు . పక్ష పాత రహితంగా వ్యవహరిస్తారు . పరిసోదనాసక్తులు . ప్రకృతి ఆరాధకులు . పాత కొత్తల మేలుకలైన వీరిని ఆకర్షిస్తుంది . తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు . ఆకర్షణకు లోబడి అందులో లయించిపొతారు .
వీరికి కొన్ని అనుకోని సంగటనలు జీవితంలో ఎదురౌతాయి. సాని ఆదిక్యత వీరిపై ప్రభావం చూపుతుంది . ఎంతటి ప్రతిభావంతులైనా సాని తీవ్రతకు లోనవుతారు . వీరి ఆలోచనలు , పనులు విదికి లోబడి ఉంటాయి . 8,17,26 తేదిలలో జన్మించిన వారు మాత్రమె కాక తేది , నెల , సంవత్సరము కలపగా వచ్చిన మొత్తం సంక్య 8 అయిన వారు కుడా 8- ఆదిక్యతలో జన్మించిన వారౌతారు . వీరు విది యొక్క ఘోర ప్రభావం నుంచి బయట పడాలంటే అదృష్ట నామం ధరించడం మంచిది .
వీరు రాగ ద్వేషాలకు అతీతులు . సమదృష్టి కల వారు . మంచి చెడులను సమ దృష్టితో పరిశీలిస్తారు . నిర్వహణా సామర్ద్యం ఎక్కువగా ఉంటుంది . ఆత్మజ్ఞానం ఉన్నవారు .
కావ్య నిర్మాణ దక్షులు . ఇతరులతో మనస్సు విప్పి మాట్లాడరు . సుఖ దుఖాలను తామే అనుభవిస్తారు . తమ లోపాలను ఇతరులకు చెప్పరు . చిరుప్రాయంలోనే రక్షకుల సాయం నిలిచి పోతుంది .
నిద్రిస్తున్న జాతిని లేపి హక్కులు – విప్లవం మొదలైన విషయాలను నేర్పే నాయకులు ఔతారు . లోక జ్ఞానం , శాసన పరిజ్ఞానం వ్యాపార తంత్రగ్నత , ఐకమత్యం , మొదలైన లక్షణాలతో ప్రజల మద్య గౌరవాభినానలను పొంద గల వారు . చాల తక్కువ మంది వీరినే ఉన్నత స్తాయి ఆదిక్యతలో జన్మించిన వారుగా పెర్కొన్నాం .
స్తిర స్వభావంతో ప్రవర్తిస్తారు . పారిశ్రామిక రంగాలలో ఆసక్తి ఉంటుంది . ఒంటరితనాన్ని ఇష్ట పడతారు . సంగీతంలో ఆసక్తి ఉంటుంది . చురుకుగా వ్యవహరిస్తారు . ఇతరులకు లోబడక తమకు లోబడే విదంగా చేస్తారు . పరోక్ష శత్రువులు ఉంటారు . వారిని జయించ గలరు . ఒక సమస్య పరిష్కారమైతే మరో సమస్య వీరి జీవితంలో మొదలౌతుంది . క్రమంగా అభివృద్ధి సాదిస్తారు . ప్రతి ముందడుగుకు పూర్వం పెద్ద పోరాటం సలిపి విజయం సాదిస్తారు .
శారీరక భలం కంటే మనోభాలం ఎక్కువ కల వారు . జన సమూహాన్ని విడచి ఒంటరిగా విహారం సలపాలని అభిలశిస్తారు .
ఇంజనీరింగ్ , ముద్రణా పరిశ్రమ , ఇనుము కరిగించే పరిశ్రమ , పాత ఇనుము పాత వస్తువుల సంబందమైన వ్యాపారాలలో ఉన్నతి పొంద గలరు .
ఇతరులతో కలసి పోరు . అసాద్యకార్యాలను ఆచరిస్తారు . తెలివి పెట్టుబడిగా పనులను చేపట్టి పూర్తి చేస్తారు . సుఖం ఉన్నా అనుకూలత ఉండదు .
దైవం మీద , పెద్దల మీద ఎక్కువ విశ్వాసం కలిగిన వారు . ప్రశాంత జీవనం గడపాలని ఆశిస్తారు . ఉన్నత ఆదర్శాలతో జీవిస్తారు . తమలో స్నేహం చేస్తున్న వారిని శత్రుత్వం నెరపుతున్న వారిని జీవితాంతం మరచిపోరు . ప్రకృతి ఆరాధకులు .
పొగడ్తకు లోబడే వీరిని ఇతరులు పొగడడం ద్వారా అనేక సహాయాలను పొంద గలరు . పై లక్షణాలన్నీ ఉన్నత స్తాయి ఆదిక్యతతో జన్మించిన వారికి చెందినవి .