9 వ సంక్యవారి పలితాలు
అంకె 9 – కుజుడు
భూపుత్రుడు
9,18,27 తేదిలలో జన్మించిన వారు . తేది , నెల , సంవత్సరం కలిపిన 9 వచ్చినా 9 అధిక్యత లో జన్మించిన వారు .
స్వభావాలు – లక్షణాలు
నవధాన్యాలు , నవగ్రహాలు , అంకెలు 1 మొదలు 9 వరకున్నవి తొమ్మిది . నవరసాలు , నవ దాతువులు , నవరత్నాలు , నవ నిధులు , సరిరంలోని నవ రంద్రాలు , ఇలా తొమ్మిదికి సంబందించిన పలు అద్బుత విషయాలు ప్రకృతిలో ఉన్నాయి .
వీరు దెస రక్షకులు . శక్తీ సంపన్నులు . దేశ భక్తులు , వివేక వంతులు , జ్ఞాన దర్సనం కల వారు .
మంచికి ప్రేరక శక్తులుగా , చెడుకు వినాస శక్తులుగా రెండు లక్షణాలు కల వారు . గాంబీర్య లక్షణం ఉన్నవారు . దయాసముద్రులు . పాలనా దక్షులు . ప్రత్యెక తీవ్రవాద లక్షణం ఉన్నవారు .
భావేసాపరులు, ఇతరులకు లోబడని వారు . తమ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తించే వారు . ఆదిక్యతా లక్షణం ఉన్నవారు . మానసిక భళా సంపన్నులు . [ కొందరు మనస్సు కోరుకొనే మత్తుపదార్దాలకు , తుచ్చ సుఖాలకు , లోబడి వాటికి బానిసలౌతారు. ] కఠిన స్వభావులు .
సనస్యలను ఎదుర్కొని పోరాడా గల వారు . ఆలోచనలు మనస్సులో ఎల్లప్పుడూ సమరం సలుపుతుంటాయి . ముఖం శాంతం గాను మనస్సు అల్లకల్లోలంగాను , లౌక్యులు , సమయ సందర్బాలను గమనిస్తూ ఉంటారు . వాదనా నైపుణ్యం ఉన్నవారు .
ఎత్తుగడలను రహస్యంగా ఉంచుతారు . కొందరు గొడవ పడడం లో ఎక్కువ ఆసక్తి కల వారు . ఇతరుల మద్య గొడవలు కలిగించి వేడుక చూస్తారు . వీరు శాంతి యుత చర్చలను ఇష్ట పడరు . అనేకుల మైత్రి లభిస్తుంది .
దేశాభిమానం ఎక్కువగా ఉంటుంది . దేశ రక్షణకై ఏ త్యాగానికైనా సిద్ద పడతారు . సమాజ సేవను నిర్వహిస్తారు . తమ వర్ణ రక్షణకై ఆసక్తి చూపుతారు . బందం వీరి మనసును బందిస్తుంది .
ఇతరుల మాటలను వినరు . తమ మాటలను సభ ఆమొదించాలన్నది వేరి కోరిక . వీరి మాటలు అడ్డుతగిలితే గొడవలు వస్తాయి . తమ మాటలను వినని వారిని శపిస్తారు . తమ మాటలకు చిత్తం అన్నవారిని చక్కగా చూసుకుంటారు , వారికి అన్ని సాయాలను చేస్తారు . వీరి తప్పులను ఇతరులు ఎత్తి చూపడం ద్వారా వీరిచే ఇతరులు ద్వేషింప బడతారు .
కొన్ని సందర్బాలలో లోపల ఒకటి బయట ఒకటిగా ప్రవర్తించే వంచకులచే మోసగింప బడతారు .
తెలివి మొగ్గలా ఉద్భవిస్తుంది . ఆలోచనలు , బుద్ది సూక్ష్మత కలిగి వీరి శత్రువుల బలాబలాలను బేరీజు వేసుకుంటారు . తమకంటే బలవంతులైన శత్రువుల వద్ద మైత్రిని బలం తగ్గిన వారి వద్ద గొడవలను ఏర్పరచుకుంటారు . తంత్రజ్ఞులు శాంతి కాముకులు గా కన్పిస్తారు . గొడవ పడడంలో ఎక్కువ ఆసక్తి ఉన్నవారు . తీవ్ర వాద దోరణి ఎక్కువ . ముఖం ప్రశాంతంగా ఉంటుంది
సమయానుగుణంగా ప్రవర్తిస్తారు . గొడవలలో నష్టం కలిగితే శాంతికి పూనుకుంటారు . చర్చల ఫలితం వీరికి అనుకూలంగా ఉండాలి . లేకపోతె ఎదుటివారు ఎంత పెద్దవారైనా నిందిస్తారు .
ఉన్నత ఆలోచనలున్న కుజుని ఆదిక్యత కొరవడితే మూర్కత్వం , రాక్షసత్వం ఘనీభావిస్తాయి .
బుద్ది మంతులైన వీరు శత్రువును సమయం ఎరిగి బోల్తా కొట్టించగా గలరు . శత్రువును ప్రత్యక్షంగా ఎదుర్కోవడం కాక [ వంచన తో ] శాంతి ప్రదర్శించి జయిస్తారు . తన రహస్యాలను ఎవరి వద్ద బయట పెట్టరు . రహస్య రక్షకులు , చురుకుదనం లేనివారుగా కన్పించినా మనసు తేనెటీగ లాగా పరిబ్రమిస్తుంది .
మానసిక అనిశ్చితి లో ఆవేశానికి లోనై తాము మాట్లాడుతున్నది ఏమిటన్నది కూడా గ్రహించ లేక మాట్లాడేస్తారు .
విజయం లో వివేకం , ఓటమితో వేణు తిరిగని మనస్తత్వం కల వారు . విరామమెరుగని శ్రామికులు . పోరాట పటిమ కల వారు . కొత్త వాటిని కనుగొనడంలో ఆసక్తి ప్రదర్శిస్తారు . తమ ఇష్ట దేవతను ప్రార్దిస్తారు . తమకు తాము నియమ నిబందనలు ఏర్పరచుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు .
యోగం, ద్యానం , వైద్యం , వశీకరణ విద్యలలో నిష్ణాతులవుతారు . దెస రక్షణకైన సైనిక రంగములో విశిష్టమైన సేవలు చేసి పెద్దల అభినందనలను , దేశ రక్షణ , తమ వర్ణ రక్షణలో ఆసక్తి కల వారు .
రహస్య కళలను నేర్చి వాటిలో రాణిస్తారు . ప్రపంచ జనులకు మార్గ దర్సులై ఉంటారు . 9- వ అంకె యొక్క మంచి ఆదిక్యతలో జన్మించిన కొందరికి అపూర్వ శక్తులు ఉంటాయి . వీరు కుటుంబాన్ని విడచి ఒంటరి తనాన్ని ఇష్టపడతారు . పరిస్థితులను చక్కగా గ్రహిస్తారు .
శిల్ప కళలలో నిష్ణాతులు . అడవిని సుక్షేత్రంగా , కొండలను నగరాలుగానూ తీర్చి దిద్దగలరు . క్రొత్త ఊరు, నగరం , దేశాలనే రూపొందించగల భుదేవత ఆశిస్సులు ఉన్నవారు . భవనాలను పలువురు ఆశ్చర్య పడే విదంగా కడతారు .
9- వ ఆదిక్యత తగ్గినా వారు ఇతరుల ఇళ్ళకు నిప్పు పెట్టడం వంటి నీచ కార్యాలకు పూనుకుంటారు .
9- ఆదిక్యత కల వారు ఇతరుల దుఃఖాన్ని పోగోడతారు . మాత్రుదేస రక్షణకై శత్రుసైన్యం మీద బాంబులు వేసి , క్షిపణులను ప్రయోగిస్తారు . యుద్ద వీరునుకి కల పోరాట పటిమ ఈ అంకెలో జన్మించిన అందరికి వర్తిస్తుంది . చాలంజ్ ను ఎదుర్కొన గలరు . ఇల్లు, కార్యాలయం, మిత్రులు అందరిలోనూ , అన్నిచోట్ల సంస్కరణ ముద్రలు ప్రతిబింబింప చేస్తారు . తమ ఆదర్శాలను మనస్సులో లోతుగా ముద్రించుకుంటారు .
జీవితంలో అనేక సమస్యలు వెన్నాడుతాయి . వెంట్రుక వాసిలో ఆపద తప్పించుకోవడానికి సరయిన సాక్ష్యం వీరే . పోరాట పటిమ గల వీరికి కార్య బంగాలు ఏర్పడుతుంటాయి . తీవ్ర కృషితో విజయం సాదిస్తారు . ఈ అంకె ప్రభావం వలన వంచన గల వారితో జీవించ వలసి ఉంటుంది . అయినా విజయం వీరిదే .
వీరి చుట్టూ దుర్మార్గులు , వంచకులు ఉంటారు . సమయం చూసి వీరిని మత్తు పెట్టాలని యత్నిస్తారు . కాని వీరి బుద్ది సూక్ష్మత కారణంగా తప్పించుకుంటారు . లోక జ్ఞానం ఎక్కువ .
ప్రవర్తనలో యుద్ద సమయంలోని యుక్తులు కనిపిస్తాయి . సహనంతో ఉంటె విజయం తద్యం . అవసర పడి గొడవ పడక ప్రశాంతంగా ప్రవర్తించాలి .
యౌవనం సమస్యల మయ జీవితం కలిగి ఉంటారు . అనేక ఇబ్బందులకు లోనవుతారు . యౌవన చరమ దశనుంచి అదృష్టం మొదలై , మద్య వయస్సుకు తర్వాత శాస్వత మైన అదృష్టం ఉంటుంది . గెలుపు ఓటముల పట్ల స్తిర మనస్కులు . ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే దృడ చిత్తం ఉన్నవారు . ఆత్మా స్తుతి చేసుకుంటారు . సంగీత, సాహిత్య నాటక రంగాలపై ఆసక్తి ఉంటుంది . దివ్య సంగీత సాహిత్య నాటక రంగాలపై ఆసక్తి , ఆత్మా స్తుతి చేసుకుంటారు . సంగీతంలో లయించి పోతారు . మొండితనం ఉంటుంది . తమ మాట , ప్రవర్తన సరైనవని నిరూపించుకుంటారు .
వీరి అభిప్రాయాలను ఎవరూ మార్చలేరు . వీరి మనస్సును ద్రవింప జేయడం కష్టం . ఎల్లప్పుడూ మనస్సులో ఉత్సాహం ఉంటుంది . 9 వ అంకెకు చెందిన పలువురు చిరునవ్వుతో కన్పిస్తారు . ఇతరులకు హితవు చెప్పడంలో సిద్ద హస్తులు .
ధన భలం సైన్య భలం [ అంగ భలం ] వీరికి ఆయా సమయాలలో తగువిదంగా సాయ పడతాయి . వీరి వీరావేశ ఉపన్యాసాలకు పిరికి వాడు సైతం వీరుడిగా అవతరిస్తాడు . జీవిత ఉత్తర బాగం లో నిరాడంబర రీతిలో దానం చేసృతుంది . పెద్దల స్నేహం , ఉత్తముల ఆశిస్సులు పొందుతారు . పెద్దలను గౌరవిస్తారు . పువ్వులను ఇష్ట పడతారు .
తమ మనస్సుకు నచ్చిన వారైతే వారి వద్ద ఎక్కువగా ప్రేమాభిమానాలు కలిగి సాయం చేస్తారు . నమ్మకస్తులుగా ఉంటారు .దెసమ్ యొక్క ముక్య బాద్యతలు వీరు చూస్తారు . స్వీయ రక్షణా నైపుణ్యం కల వారు . రహస్యాలు ఎరిగిన వారు . ఆడంబరమైన ఖర్చుల పై ఆసక్తి [ మొత్తం సంక్య విరుద్దమైతే పిసిని గొట్టుతనం చాలా ఎక్కువగా ఉంటుంది . ఆహార విషయంలోనూ లోభాత్వం కనిపిస్తుంది . లొభత్వానికి , పొదుపరి తనానికి తేడా ఉన్నది . ]
ఆడంబర వస్తువులపై వ్యామోహం ఎక్కువ . వీరున్న చోటుని కళాత్మకంగా తీర్చి దిద్దుతారు . భావావేశా పరులు కనుక ప్రమలో పడడం తేలిక. మహాత్ములు, భక్తులుగా , శిష్యులుగా , పెద్దలకు అనుచరులుగా , మహా కళాకారులకు అభిమానులుగా ఉంటారు .
జ్ఞాన మార్గం కనుగొంటారు . అనేక విదాలుగా కలలు వస్తుంటాయి . వీరిలో దివ్య లక్షణాలు ఉంటాయి .
రాజ్య పాలనా సమర్ధులు . జనులు కీర్తించే గురువులవుతారు . తమకు అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహిస్తారు . శాంతితో విజయం సాదిస్తారు . అనేక కార్యాలను నిర్వహిస్తారు . సైన్యానికి నాయకత్వం వహించ గలరు . ధన , ధాన్య సంపదలు చేరుతాయి .
సినిమా , కళలు , నాటక రంగాలలో విజయ పతాకం ఎగుర వేస్తారు . పవిత్రమైన ఊహలు కల వారు . మనసులో విలక్షణ ఆలోచనా తరంగాలు జనిస్తు ఉంటాయి . ఆట , పాట , కధ , కవిత్వం , చిత్ర లేఖనం , సంగీతం మొదలైన వాటిలో అభిరుచి కల వారు . వాటిలో ప్రవేశం కూడా ఉంటుంది .
శారీరక ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు . వీరి రూపం లో గాంబీర్యం , ఆకర్షణ ఉంటుంది . తమ శత్రువులను ఎక్కువగా దిక్కరిస్తారు . భయం లేకుండా గొడవ పడతారు . [ కుజుడికి పోరాడే గుణం ఉన్నది ] తమ స్వీయ సిద్దాంతాలను ఎప్పటికి విడచి పెట్టరు . వీరికి ప్రత్యక్షంగా కాక . పరోక్షంగా వ్యతిరేకత , శత్రుత్వాలు ఉంటాయి . వీరి సద్గుణాలను ఇతరులు గ్రహించరు .
న్యాయానికై పోరాడుతారు . నీతి రహితంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే కోపం తో ఊగిపోతారు . అకారణంగా నష్టం వాటిల్లినా పట్టించుకోరు . బాగా శ్రమించి క్రమంగా అభివృద్ధి గాంచి ఉన్నత స్తాయికి చేరుకుంటారు . మానవ సహాయం కంటే దైవానుగ్రహం వీరికి ఎక్కువ ఉంటుంది .
ప్రేమాభిమానాలకు తల వంచుతారు . ఎరంగములొనైనా రాణిస్తారు . పొగడ్తకు లొంగుతారు . సహనం తో ఎపనినైనా చేపడతారు . శారీరక పటుత్వం ఎల్లప్పుడూ సక్రమంగా ఉంటుంది .
యౌవనం , వృద్దాప్యం ఒకే విదంగా ఉంటుంది . అంటే వృద్దాప్యం లోను యువకుల్లా చురుగ్గా వ్యవహరిస్తారు . చేస్తున్న పనిలో సంపూర్ణంగా లోనవుతారు . కొత్తదనం కోసం పాకులాడుతారు . వీరికి ఆదునిక దృక్పదం ఎక్కువ [ వీరు పోరాట పద్దతిని , మొండి పట్టుదలకు సమయానుగుణంగా సవరించుకుంటే సత్పలితం ఉంటుంది ]
హటాత్తుగా భావావేశానికి లోనవుతారు . తొందర పాటు తనం కొన్ని సందర్బాలలో ప్రతిఫలిస్తుంది . బెదిరింపులతో కాలం గడుపుతారు . ధైర్యస్తులు , భోజన ప్రియులు . తరచుగా విదేశ ప్రయాణాలు చేస్తారు . ఉల్లాస యాత్ర వీరికి సంతోష దాయకం . అడవులు , కొండలు , పచ్చటి భయలలు చూసి పరవసిస్తారు .
వీరి జీవితం లో అనేక వినోద సంగటనలు జరుగుతాయి . ఎల్లప్పుడూ కొంత మంది వీరి చుట్టూ ఉంటారు . వీరి మాటలకు అందరు లోబడి ప్రవర్తిస్తారు . కళలకు సంబందించిన , అగ్ని, అధికారాలకు సంబందించిన వ్రుత్తి ఉంటుంది .
దానధర్మాలు చేస్తారు . శక్తీ గల దైవ భక్తులు . తుచ్చ సుఖాలకి డబ్బును విరివిగా కర్చు పెడతారు . వెళ్ళిన చోట్ల సుఖబోగాలను అనుభవిస్తారు .
రాజ్య తంత్ర న్యాయ సంబందమైన విషయాలు తెలిసిన వారు రక్షణ పద్దతులు తెలుసు . [ కొందరు మద్యపానం , వ్యభిచారం వంటి చేడుపనుల వైపు మనసు మళ్ళించి సంపదను పోగొట్టుకుంటారు . కుజ బలం తగ్గిన వారి ప్రవర్తన ఇది ] ఒక పనికి పూనుకోవడానికి ముందు పలు పర్యాయాలు ఆలోచిస్తారు . విజయ సాదకులైన వీరు తొందర పాటు తనం తో చేసిన నిర్ణయాలు ఓటమి పాలఒఉతయి
సైన్య, రక్షక భట , వ్యవస్తలలొ ఉన్నత పదవులు పొంద గలరు . అగ్ని సంబందమైన పరిశ్రమలు అనుకూలమైనవి . వైద్య రంగములో రాణింపు ఉంటుంది . ఇంజనీరింగ్, రసాయన రంగాలు కూడా మంచివే . పారిశ్రామిక వేత్తగా , పరిశ్రమ జ్ఞానం కలిగి ఉంటారు . శాస్త్ర వేత్తలుగా ఉంటారు . ఎగుమతి , దిగుమతి వ్యాపారం చేస్తారు .
సినిమా , నాటకం , పత్రికలూ , రేడియో , టీవి వంటి రంగాల గురించి అవగాహన ఉంటుంది . సులభంగా ఆకర్షించే మాటలు ముఖ లక్షణాలు ఉండడం వలన జన సంబందమైన వేనినైనా చక్కగా నిర్వహించ గలరు . ప్రశాంతమైన , ఆనందమయమైన జీవితాన్ని ఆశిస్తారు . వృద్దాప్యంలో ఆద్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటారు .
అందరిని ఆకర్షించే స్వభావం ఉన్న వారు . అనేక రంగాలలో విశిష్టతను గడిస్తారు . కోపం వచ్చినప్పుడు మండిపడతారు . సంతోష సమయంలో శాంతి స్వబావులుగా ఉంటారు .
ఇతరుల మనస్సు వీరి ఆడినం లో ఉంటుంది . తంత్రాలు, ఎత్తుగడలు , మనసులో దాపరిక వంటివి వీరి ప్రత్యెక గుఆలు , గడించిన సంపదను ఆత్మా తృప్తికై విపరీతంగా కర్చుపెడతారు . ఆద్యాత్మిక బలం వీరికి తోడుగా ఉంటుంది . దేశ భక్తులు , దాన గుణం ఉన్నవారు . మానవత్వం ఉన్నవారు . జీవితపు ఉత్తర భాగంలో సుఖంగా జీవిస్తారు .