Numerology . 7 వ సంక్యవారి పలితాలు


                                


 7 వ సంక్యవారి పలితాలు
అంకె 7 – కేతువు
త్రికాలజ్ఞుడు
      7,16,25 తేదిలలో జన్మించిన వారు తేది , నెల, సంవత్సరము కలుపగా7 అయిన కేతు ఆదిక్యతలో జన్మించిబ వారు .

లక్షణాలు – స్వభావాలు

         మానవ జీవితంలో ఏడుకు సంబంచిన అంశాలు  అసంక్యాకంగా ఉన్నాయి . జ్ఞాన చిహ్నమైన కేతువు అన్ని చిట్ల , అన్నిటా శాశ్వతంగా ఉన్నవాడు . వారానికి ఏడు రోజులు , సప్తర్షులు , సప్త మహా సముద్రాలు , సప్త కన్యలు  , సప్త స్వరాలూ , సప్త నాడులు , సప్త లోహాలని ఎన్నో అంశాలు ఎదుకు సంబందించినవి గా ఉన్నాయి .

        వీరి జీవితం ఆద్యాత్మికమై ఉంటుంది . పురాణ శాస్త్రాలపై అమిత విశ్వాసం , పరిశీలనా భావం ఉంటుంది . చక్షు గోచారం కాని శక్తులను పరిసోదిస్తారు .  మంత్రం, యోగ వ్యవహారాలను గ్రహిస్తారు . ధర్మగుణం , ఆత్మ పరిజ్ఞానం ఉన్నవారు . తీవ్ర కృషితో కార్య సాదకులవుతారు .
        మానవాతీత శక్తులను గ్రహిస్తారు . బుడ్డి బలం ఉన్నవారు . ప్రేమ , జ్ఞానం , ధర్మం  , దాన గుణాలు కల వారు . పెద్ద మనుష్యులుగా , సంస్కార వంతులుగా ఉంటారు . ముఖ  వర్చస్సు , సంత ద్రుక్పదము , దివ్యత్వం ఉన్నవారు .

     చేపట్టిన కార్యాన్ని ముగిస్తారు . ముందుకు అడుగిడిన తరువాత వెనుదిరిగే ప్రసక్తి ఉండదు . ఆదర్శ తీవ్రత ఉంటుంది . ముఖంలో స్పష్టత , వశీకరణ  శక్తీ  ఉంటుంది . పొడవైన ఆకారం , ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు . మాటలో సౌమ్యత ఉట్టిపడుతుంది . ఆత్మా విశ్వాసం, ధైర్య గుణాలు ఉంటాయి . మానసికోల్లసం ఉంటా గొప్ప వ్యక్తులవుతారు . ఉత్సాహం లేకపోతె మౌనంగా ఉంటారు .

        ఇతర అంకెలకు చెందిన వ్యక్తులకంటే వీరు బిన్నంగా కనిపిస్తారు . న్యాయం కోసం పోరాడుతారు . తమకంటూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు . మంచి మిత్రులు తక్కువగా ఉంటారు . నిజాయితీగా ఉండాలనుకునే వీరికి ఇతరులకు అభిప్రాయ భేదం ఉంటుంది .

       ఈ అంకెకు చెందినా వ్యక్తులకు శారీరక  భలము కంటే  మనోభాలం ఎక్కువ .లక్ష్య శుద్దితో ఎకార్యం లోనైనా విజయం సాదిస్తారు . కొన్ని సందర్బాలలో ఎక్కువ ఆందోళనకు గురి అవుతారు . వీరి ఆలోచనలు , పదకాలు భవిష్యత్తుకు గురించినవిగా ఉంటాయి . ప్రజల ఆదరణ ఉన్నట్లయితే సాహసం తో ప్రవర్తించి సంపూర్ణ విజయం పొంద గలరు .

           స్వతంత్ర బుడ్డి కల వారు . ఎవ్రుత్తిని చేపట్టినా ఇతరుల జోక్యం ఇష్ట పడక స్వయంగా కృషి సలుపుతారు . మనస్సులో కొత్త అభిప్రాయలు పుడుతూ  ఉంటాయి . ఇతరులను అనుసరించారు. వీరి మార్గాన్ని ఇతరులు అనుసరిస్తారు . ప్రజలకు మార్గ దర్శకులుగా ఉంటారు . ప్రతి విషయంలోనూ స్వేచ్చను కోరుకుంటారు . బుద్ధిబలం ఉన్నవారు . కల్పనా శక్తీ వృద్ది చెందుతుంది .

       వీరి మాటలలో , చేష్టలలో ప్రత్యేకత గోచరిస్తుంది . ప్రజల దుఃఖం పోగొట్టే వారుగా ఉంటారు .
       కొన్ని సందర్బాలలో మితి మీరిన కోపం తెచ్చుకుంటారు . కాని వెంటనే సర్దుకుంటారు . సమాజ హిత కార్యక్రమాలలో పాల్గిని కీర్తి గడిస్తారు . కళలకు సంబందించిన వస్తువులు వీరికి ఇష్టం కలిగిస్తుంది . చేస్తున్న పనులలో కొత్త ధనాన్ని ప్రవేశ పెడతారు . ఆనంద మయ పరిస్తితుల మద్య అనుకూల పలితాలను పొందగలరు .

      ఒంటరి తనాన్ని ఇష్ట పడతారు . ద్యాన , యోగ , మంత్ర శాస్త్రాలలో అభినివేశం ఉంటుంది . ఒంటరిగా ఉన్నప్పుడు కల్పనా శక్తి వృద్ది చెందుతుంది . మాట్లాడడం కంటే ద్యాన స్తితిని  ఇష్ట పడతారు . తమ సంతోషం గురించి , జయాపజయాల గురించి ఎవరితోనూ చెప్పరు . మనసులోనే దాచుకుంటారు .

            ఇంద్రియాలను అదుపులో ఉంచగలరు . చిరు ప్రాయం నుంచి కళలలో ఆరితేరి ఉంటారు . 7 వ అంకె ఆదిక్యతలో 1 వ తెగ వారు కళల పట్ల ఆసక్తి పుట్టినప్పుడే పుణికి పుచ్చుకుని కళలను  లక్ష్యంగా చేసుకొని విజయం సాదిస్తారు . వీరి వద్ద తీవ్రమైన కళా శక్తి , ఆద్యాత్మిక భలం  ఉంటుంది .  మిత్రులనేకులను పొంది క్షేమంగా జీవిస్తారు .

        7 వ అంకె ఆదిక్యతలోని 2 వ తెగ వారు కంప్యుటర్ , గణిత శాస్త్రము , రసాయన శాస్త్రాలలో ప్రవేశం ఉన్నవారు . వీరికి కళలంటే ద్వేషం ఉంటుంది . దేశ భక్తులు .
         సామాన్యంగా 7 వ అంకె వ్యక్తులు రచన , చిత్ర లేఖన , సంగీత , నాట్య , నటన, దర్సకత్వ రంగాలలో ప్రసిద్ది గడించ గలరు . రచనా , సామర్ధ్యం , వాక్చాతుర్యం కల వారు . ఆ కారణంగా డబ్బు గడించ గలరు . సినిమా రంగములో ప్రక్యాతి పొంద గలరు .

        చిరు ప్రాయం నుంచి తల్లి తండ్రుల మీద , దేశం మీద భక్తి కలిగి ఉంటారు . రాజకీయంలో విప్లవం సృస్టిస్తారు . దేశ క్షేమం  ఆశించి ఎత్యగానికైనా సిద్దపడతారు . రాజకీయ సూక్ష్మత , రాజకీయ లక్షణాలు ఉంటాయి . పెద్ద పార్థి  లో చేరక , దేశ అభివృద్దిని కాంక్షించి చిన్న పార్థిలొ చేరి తమ కృషి వలన తమ పార్టిని బలపరచ గలరు .

       ఎ విషయాన్నైనా వ్యతిరేకించి వాదించే సామర్ద్యం ఉన్నవారు . వ్యతి రేకత వీరికి  ఆసక్తి కలుగుతుంది . ఎందులోనైనా న్యాయమైన విజయం పొందాలనుకుంటారు . అతిది సత్కారంలో ప్రత్యేకత కనపరుస్తారు . వీరి మెదడు మెరుపు వేగం తో పదకాలు రూపొంచంచ గలరు . అనేక కోణాలలో ఆలోచించన పిదప మంచి నిర్ణయానికి వస్తారు .

        మిత్రుల వద్ద , బందువుల వద్ద విశ్వాసంతో ప్రవర్తిస్తారు . సాయం అడిగిన వారికి తమకు సాద్యమైనంతలో సాయపడగలరు . ఆదరణలో ప్రత్యేకత కన్పిస్తుంది . కష్టాలున్నప్పుడు తీవ్ర వాద దోరణిలో ఉంటుంది . వీరి విజయాలను చూసి ఇతరులు అసూయా పడతారు .
         రాజకీయ, సినిమా రంగాలలో మిక్కిలి రాణిస్తారు . క్రీడల కంటే రాజకీయ , సినిమా రంగాలలో నే  వినుతికేక్కుతారు .

       వీరిలో ప్రత్యెక ఆకర్షణ శక్తీ ఉన్నది . ఇందువలన భవిష్యత్తును చూడ గలరు . వీరి జీవితం ఇతరులకు ఉదాహరణ గా ఉంటుంది . వీరి చర్యలు అందరిని ఆకట్టుకుంటాయి .
      లాటరి , రేసుల ద్వారా సంపాదించాలని కోరిక ఉండదు . హటాత్తుగా వచ్చే సంపదపై మోజు లేని వారు . జన్మతః అపూర్వ శక్తులు కలిగిన వీరు కృషి ద్వారా విజయం సాదిస్తారు . బుద్ది సుక్ష్మత భోదనా సామర్ద్యం ఉంటుంది .

      కృషితో ఉన్నత మైన వారు . మేధావులు , జ్ఞానులు , తాజకియ నిపుణులు , వైద్యులు , రాజకీయ వేత్తలు , సినిమా నటులుగా రాణించిన వారందరూ పైకోవకు చెందినవారే .
        ఇతరులకు అనుగుణమైన ప్రవర్తన , ధారాళమైన మనస్సు కల వారు . పసి ప్రాయం నుండి సంగీత , సాహిత్య , నటనా రంగాలలో ప్రతిభ కనపరుస్తారు . పలువురిచే అభినందనలు , బిరుదులూ పొంద గలరు .

           ఆద్యాత్మిక నియమాలు ఎరిగిన వారు . అన్ని మతాలను గౌరవిస్తారు . వర్గ భేదాలు లేని వారు .. జ్ఞాన మార్గాసక్తులు .  వీరి కలలు ఫలిస్తాయి . ఆకర్షణ లక్షణం పుట్టుకతో వచ్చిన గుణం . వాకచాతుర్యం కల వారు . తరచుగా దివ్యానుభూతులతో నిండిన అపురూప దృశ్యాలు కలలో కనిపిస్తాయి . వాక్కు ఫలిస్తుంది .

          పేదల పై దయ కల వారు . మంత్రం సిద్ది , ఆకర్షణ సిద్దిస్తుంది . కుటుంబ జీవితం గడుపుతూనే జ్ఞానం గడించ గలరు . జీవితం అనుభవించడానికే అన్న సిద్దాంతం ఉంటుంది . మనస్సు ఎల్లప్పుడూ నిలకడ  లేకుండా చలిస్తూ ఉంటుంది . కొన్ని సందర్భాలలో చిన్న విషయాలకు సైతం దీర్గంగా ఆలోచిస్తుంటారు .

          మనస్సుకు నచ్చ్కాని పనులు చేయరు . ఎంత లాభ సాటి వ్యవహారమైనా మనస్సు మేచ్చితేనే పూనుకుంటారు . సర్వ శక్తులు ఆదర్శం వైపు కు మళ్ళించి ఉన్నత స్తాయిని అందుకుంటారు .

          సందర్బం , పరిస్తితులు , చక్కగా అనుకూలిస్తే అసాధ్యమైన పనులను ఆచరించి మహాత్ముడనీ కీర్తి గడిస్తారు . ఎల్లప్పుడూ చురుగ్గా ఏదో ఒక పనిని  చేస్తుంటారు . ఎంతటి పనినైనా సునాయాసంగా ముగించ గలరు .

 సమాజంలో అందరూ వీరిని అభినందిస్తారు . ప్రజల మద్య ప్రత్యెక గౌరవం ఉంటుంది . అనేక వృత్తుల ద్వారా సంపద చేరుతుంది . వయస్సు పెరుగుతున్న కొద్ది  వీరి జీవన స్తాయి పెరుగుతూ ఉంటుంది . ఎ పనిని చేపట్టినా తమ ప్రత్యక్షం లోనే జరగాలని భావిస్తారు .  వీరి విజయ రహస్యం ఇదే .
        శ్రమించడం ద్వారా ప్రగతి సాధ్యమని సంపూర్ణంగా విశ్వసిస్తారు . ఇతరుల మనస్తితిని గ్రహించి ప్రవర్తిస్తారు . వీరి మాటలలో , చేష్టలలో తాత్విక దృక్పదం బహిర్గతమౌతుంది . సంఘ సేవకై ఆసక్తి ఉంటుంది . ఇందుకై పెద్ద మొత్తంలో విరాళం ఇస్తారు .

        నదులు , సముద్రాలు , ప్రక్రుతి రమణీయ దృశ్యాలను చూసి వీరి మనసు పరవసిస్తుంది . ప్రయాణాలు , వాహనాలు నడపడం మొదలైనవి ఇష్ట పాడుతారు . ఈ అంకె వ్యక్తులు పలువురు విదేశాలకు వెళ్లి డబ్బు గడిస్తారు .

         సమస్యలను ఎదుర్కొని నూతనత్వాన్ని దర్శించగలరు . ఎదురీదడంలో సమర్ధులు . ఒకేరకమైన పని చేయడం వీరికి నచ్చదు . తరచుగా అందులో నూతనామ్సాలను  చొప్పిస్తారు . సూక్ష్మ బుడ్డి భవిష్యత్తును ముందుగా గ్రహించే దివ్య శక్తీ వీరికి జన్మతః అలవడుతుంది .
       చేపట్టిన కార్యాన్ని చెక్కగా నిర్వహిస్తారు. తమ్ము ఆశ్రయించిన వారిని తప్పక కాపాడుతారు . వీరికి మంచి కల్పనా శక్తి ఉంటుంది . మనస్సులో పవిత్రాలోచనలు ఉద్భవిస్తాయి . కష్ట సుఖాలలో ఒకే తీరుగా ప్రవర్తిస్తారు . కీర్తి , సంపద , అధికారాలు ఎంత వున్నా సామాన్యునిగా నిరాడంబరంగా వ్యవహరిస్తారు .

         జీవిత ప్రారంబములో ఆర్ధిక విషయమైన ఎత్తుపల్లాలున్నా యవ్వన ప్రాయం నుంచి సంపద చేరుతుంది . అవసరాలకు తగిన డబ్బు వస్తూ ఉంటుంది .తమ వృత్తిలోను , జీవితం లోను ఇతరులు జొరబడడం ఎన్నడు ఇష్టపడరు . స్వేచ్చగా ఉండాలని ఆశిస్తారు .

         ఇతరులు నమస్కరించదగిన వారుగా ఈ అంకెకు చెందినా కొందరు ఉంటారు . పుట్టుకతోనే దివ్య లక్షణాలు కలిగి ఉంటారు . వీరికి సంసార జీవితం మిశ్రమంగా ఉంటుంది .పెరు అనుకూలంగా ఉంటె కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగుతుంది . అదృష్ట నామం లేకపోతె వీరి జీవితం దుక్క మయంగా మారుతుంది .

          ఆద్యాత్మిక జీవితం పూర్ణ ఫలవంతమౌతుంది. ఈ అంకెకు చెందిన స్త్రీ పురుషులు ఇరువురు మంచి కృషి సలిపే వారు . ఎసమయంలోనూ పనులు చేస్తూ ఉంటారు . అనుకూల పరిస్తితులలో ఎంతటి   పనినైనా ముగించ గలరు .

         ప్రఖ్యాత రచయితలు , చిత్రకారులు , ముద్రాపకులు , సంగీత విద్వాంసులు , భావన నిర్మాణ కుశ లురు , సినిమా దర్శకులు , ఛాయాగ్రహకులు , రికార్డింగ్ నిపుణులు , నటినటులు 7 వ అంకెకు జన్మించిన వారే . సినిమా , రాజకీయ , ఆద్యాత్మిక రంగాలలో రాణిస్తారు . కళాత్మకంగా వృత్తిని నిర్వహించి విజయం సాదిస్తారు .

          చట్ట నిపుణులు , ఆర్ధిక శాఖ , న్యాయ శాఖలలో ఉన్నవారు , ద్రవపదార్దాల వ్యాపారం , మందుల తయారి , ఎగుమతి , దిగుమతి వ్యాపారం , ఓడ ప్రయాణం ద్వారా వర్తకం , పెట్రోల్, గ్యాసు  వంటి ఇందనాల వ్యాపారం , ఫైనాన్స్ , రసాయనాల వంటి విషయాలలో ఔన్నత్యం పొంద గలరు .

       వీరి ఇష్టానుసారం విడిచి పెడితే అభినందించ దాగిన పనులు చేస్తారు . జీవితం లో ఏర్పడే సుఖ దుఖాలను సహజంగా స్వీకరించే దృడ చిత్తం కలవారు . దైవానుగ్రహం పొందిన వారు . నూతనత్వాన్ని ఇష్టపడే వీరు స్వేచ్చా ప్రియులు .

        వేరి మైత్రి కోసం ఇతరులు పోటి పడతారు . శత్రువునైనా ఆకర్షించే శక్తీ ఉన్నవారు . చిత్త శుద్దితో చేపట్టిన పనిని నిర్వహిస్తారు . ఇతరులు సాద్యం కాదని విడచి పెట్టిన పనులను ముందుంది నిర్వహిస్తారు .

        ప్రేమానురాగాలకు ప్రాదాన్యతను ఇస్తారు . ఆకర్షనీయమైన రూపం కలిగిన వీరు కళల పట్ల ఆకర్షితులవుతారు . వీరిలోని సుగుణాలే ఉన్నత స్తితికి కారణాలు . సంపద క్రమంగా వృద్ది చెందుతుంది . జ్ఞాన మార్గం లో ఇష్టం ఉంటుంది. ఇతరులను బాగు చేసే పనులను  చేపడతారు .
      7 జ్ఞానాదిక్యతను సూచించే అంకె , ఈజిప్టు వాసుల దేవతలు ఏడుగురు . బైబిలులో 7 ను సూచించే శబ్దం పవిత్రంగా ఎంచ బడుతుంది .

     వైద్య రంగములో ఉన్నవారు దేనినైనా సునాయాసంగా గ్రహించ గలరు . ఎ రంగం లోనైనా తోలి స్తానం లో ఉంటారు . ఎంతటి దుఖమైనా మనస్తైర్యం విదవరు . విదేశ పరిచయాలు ఉంటాయి . ఇతరుల సలహాలను విన్నా , వాటిని సంపూర్ణంగా ఆచరణలో పెట్టరు .
 ఎ పనినైనా తమ స్వంత అభిప్రాయాలను అనుసరించి చేస్తారు . దేనినైనా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు . మెదవిగా కీర్తి గడిస్తారు . తమకంటూ ప్రత్యెక మార్గాన్ని నిర్దేసించుకుంటారు . వీరి స్వభావాన్ని గ్రహించి కుటుంబ సబ్యులు ప్రవర్తిస్తే వీరు సాదించలేని పనులు అంటూ ఏమి లేవు .

        వీరు రచనలు , ఉపన్యాసాల ద్వారా , కళలకు సంబందించిన ఒక వృత్తిని చేపట్టి అభివృద్ధి పొంద గలరు . జీవితాన్ని తాత్విక ద్రిష్టితో చూసే స్వభావం వీరికి వుంటుంది . దూర ప్రాంతాలలో జరుగుతున్న విషయాలను  తెలుసుకుంటారు .

     మార్మిక విద్యలలో ప్రవేశం ఉంటుంది . ఇంద్రియాలకు గోచారం కాని అరుదైన అనేక విషయాలను గ్రహించ గల ప్రతిభావంతులు . సన్యాసిలాగా ప్రవర్తిస్తారు .  తుచ్చ సుఖం , నాగరిక వ్యామోహం లేని వారు . జీవిత ప్రారంబం లోనే అదృష్ట దేవత దృష్టి వీరికి లభిస్తుంది .  పిల్లల మనస్తత్వం ఉన్నవారు .

       ప్రపంచ వ్యవహారాలన్నిటిని తెలుసుకుంటారు . లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది . స్నేహ భావం కల వారు . స్త్రీ పురుషుల ఇరువురికి మిత్రులు చాలా మంది ఉంటారు . అంతకు పూర్వం ఎ మాత్రం పరిచయం లేని వారితోనైనా స్నేహం పాటించ గలరు .

          ఏ రంగం లోనైనా తమ ప్రత్యేకతను చాటు కుంటారు . ప్రయాణాలు వీరికి ప్రీతి పాత్రమైనవి . ఇంట్లో  కుక్కలు , పిల్లులు , పశువులు , మేకలు , కోళ్ళు , పావురాలు , కుందేళ్ళు వంటి ప్రాణులను పెంచుకుంటారు . వాటిపై అనురాగం చూపుతారు .

        కీర్తి గడిస్తారు . శారీరక సుఖాన్ని త్యజిస్తున్న కొద్ది అనేక మార్గాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . [ స్వార్ధం కూడదు ] ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది . తలచినవన్ని జరుగుతాయి . న్యాయమైన ఆలోచనలు , ఆదర్శాలు అన్ని సంపూర్ణంగా విజయవంతమౌతాయి . అన్ని పధకాలు కార్య సిద్ధిని పొందుతాయి .

          మంచి కుటుంబం [ పేరు అదృష్టమైనదిగా కలవారికి ] సుఖ సంసార జీవితం , అందమైన , గుణ వంతులైన భాగస్వాములు , తరగని కీర్తి , సంపద , ప్రజల అభినందనలు మొదలైనవన్నీ ఈ అంకె వ్యక్తులకు సిద్దిస్తాయి