6 వ సంక్యవారి పలితాలు
అంకె 6 – శుక్రు
సౌఖ్య ప్రదాత
ప్రతి నెల 6,15,24 తేదిలలో జన్మించిన వారు తేది , నెల, సంవత్సరము కలిపిన 6 అయిన సుక్రదిక్యతలో జన్మించిన వారుగా పరిగణింప బడతారు .
స్వభావాలు – లక్షణాలు
ఆరు చలించని శక్తీ కలది . ఊ టలా వెలువడి , సెలయేరుగా పడి , నదిలా ప్రవహించి , సముద్రమై పరిణమిస్తుంది . ఈ అంకెకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి . షట్ శాస్త్రాలు , ఆరు ఋతువులు , షట్ ఖర్మలు , షట్ కోణాలు , – మొదలైన అనేక ఉదాహరణలున్నాయి .
పుట్టిన తేది , నెల , సంవత్సరం కలిపినప్పుడు మొత్తం సంక్య 6 అయిన రోజులలో జన్మించిన వారికి కుడా జీవితం లోని రెండవ దాస ఈ అంకెకు అనుగుణంగా సాగుతుంది .
వీరు సుఖ బోగాలు అనుభవిస్తారు . మంచివారు . ప్రజల మనస్సులను తమ వైపుకు ఆకర్షించ గలరు . సుఖమైన వ్రుత్తి ద్వారా డబ్బు గడిస్తారు . కళా ప్రియులు ఇతరుల మనస్సులోని మర్మాలను గ్రహించ గలరు . ఇతరులను సంతోష పరచి సంపదను పెంచుకుంటారు .
కళల పట్ల ఆకర్సితులవుతారు . దైవ ప్రార్ధనలో విశిష్టత చూపగలరు . శుక్రుడు రాక్షస గురువు .
తరగని సంపద తో తులతూగుతారు . ప్రజలను సంతోష పరచే వ్రుత్తి వలన పేరు గడిస్తారు . అందంపై , కళల మీద , వీరికి ఆసక్తి ఎక్కువ . ప్రపంచ బాగాలను అనుభవించడానికి జన్మనేట్టిన వారు .
ఆకర్షినియ రూపం , అందమైన ముఖం కలిగి ఉంటారు . తీవ్ర కృషితో ఎపనినైనా నిర్వహించి విజయం సాదించగలరు . కీర్తి గౌరవ సంపదలు ఎల్లప్పుడూ ఉంటాయి . అదృష్ట దేవత అనుగ్రహం నిరంతరం కోన సాగుతుంది . కనిక వీరు అదృష్ట వంతులవుతారు .
ధైర్య సాహసాలు కలిగిన వారు . కళ్ళలో ఆకర్షక కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. శుక్రుని సుఖానుభావం వీరి ప్రవర్తనలో ప్రతి విషయం లోను భాహిర్గతమవుతుంది . కధలు , కావ్యాలు , సంగీత సాహిత్య , చిత్రలేఖాన్ నాటకాదుల వంటి వాటిపై మనసు ఎల్లప్పుడూ లేనమై ఉంటుంది . అందమైన వస్తువులపై మమకారం కలిగి ఉంటారు .
కళ్ళు , చెవులు , ముక్కు , నాలుక , చర్మం మొదలైన ఇంద్రియాలకు సుఖాన్నిచ్చే విషయాలపై మక్కువ ఎక్కువ . కామ బొగ అంశాలు వీరి మనస్సును ఆకర్షిస్తాయి . జీవితం అనుభవించటానికే నని వీరి అభిప్రాయం . ఈ ప్రపంచం స్వర్గమని పేర్కొంటారు .
ఈ సంవత్సరములో ను విరక్తి అనిపించదు . మాయా శక్తులు వీరికుంటాయి . మంత్రాలు , అష్ట సిద్దుల కోసం , కార్యసిద్దికై ప్రార్ధన చేస్తారు . స్వకార్య సాఫల్యం కోసం దైవ పూజలు నిర్వహిస్తారు . స్వలాభం కోసం స్వార్ధం తో ఆద్యాత్మిక రంగాన్ని ఆశ్రయిస్తారు .
ఒక పనికి పూనుకునే ముందు అనేక పర్యాయాలు ఆలోచిస్తారు . చేపట్టిన ప్రయత్నం లో ఎల్లప్పుడూ వెనుకంజ వేయరు . ఓటమికి జంకని వారు . కార్యాచరణలో తీవ్రత కనిపిస్తుంది . ప్రపంచ జీవిత అనుభవాలను ఆశిస్తారు .
వీరి సంక్యాదిక్యత రాక్షస గురువైన శుక్రునికి సంబంచిన దయినందున కొన్ని సందర్బాలలో రాక్షస స్వబావాన్ని ప్రదర్శిస్తారు . సమాజంలో కీర్తి లభిస్తుంది . పదవులు నిర్వహిస్తారు . ఎల్లప్పుడూ నవ్వు ముఖం తో కన్పిస్తారు . కొన్ని సందర్భాలలో తమకు సాయపడిన వారిని విస్మరిస్తారు . కృతజ్ఞులుగా ప్రవర్తిస్తారు .
కీర్తి కోసం, ఆత్మ గౌరవం కోసం , డబ్బు కర్చు పెడతారు . ఆత్మా స్తుతి ఉంటుంది . కీర్తి కోసం ఎపనినైనా చేస్తారు . కళలు . నాటకం , సినిమా వంటి వాటిలో సంతోషం పొందుతారు . ఆరంగాలలో రాణిస్తారు . పాటలు , కవితలు రాయడం , కదా రచన , వ్యాస రచన , నాట్యం , గానం , నటన , దర్శకత్వం మొదలైన అంశాలలో రాణిస్తారు .
చారిత్ర ప్రసిద్ద గాంచిన స్తలాలు , నాగరిక చిహ్నాల దర్సనం , ప్రక్రుతి దృశ్యాలు , వినోద యాత్ర వంటి వాటికై చురుకుగా ప్రయాణాలు చేస్తుంటారు . ఇల్లు , వాహనం , పనిచేస్తున్న చోటు వంటి వాటిని కళాత్మకంగా ఉంచుకుంటారు . పువ్వులు, చెట్లు , నదులు , సెలయేర్లు , పక్షులు మొదలైన వాటిపై మక్కువ ఉంటుంది . ప్రకృతిని చూసి పరవసిస్తారు
వీరి చుట్టూ ఎల్లప్పుడూ మనుష్యులు ఉంటారు . కళ్ళతో చూసే ఆకర్షణ వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారు . బంగారు బంగారు ఆభరణాల పై , నవరత్నాలపై , వ్యామోహం ఎక్కువగా ఉంటుంది . తమకు నచ్చిన వారిపై మమతానురాగాలను ప్రదర్శిస్తారు . కొత్త వ్యక్తుల విషయం లో జాగ్రత్త వహిస్తారు . వీరి మాటలలో , చేతలలో , నటన ఉంటుంది , జీవితంలో కళకు సంబంచిన ఏదో ఒక వృత్తిని శాశ్వతంగా చేసుకొని ప్రగతి సాదిస్తారు .
6 వ అంకెలో జన్మించిన వారు , ప్రక్యాతి గాంచిన కళాకారులుగా రూ పొందుతారు . వీరి మాటలకు , రూపానికి ప్రజలు వశీ క్రుతులవుతారు . ప్రజల ఆదరాభిమానాలు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి . ఆకర్షనీయ రూపం వలన చాల సులభంగా ఎవరితోనైనా కలసి పోయి స్నేహం పాటిస్తారు . కళాత్మక దృక్పదం ఉన్న పలువురు వీరికి ఎల్లప్పుడూ సాయం చేస్తూ ఉంటారు .
శుక్రుడు భలమైన కామ కారకుడైనందున వీరికి ఇతర అంకెలకు చెందిన వ్యక్తుల కంటే పుత్రా భాగ్యం ఎక్కువగా ఉంటుంది . శుక్రుడు సెక్స్ సుఖాన్ని ఇవ్వడం , వీర్యాభివ్రుద్ది కి తోడ్పడడం వలన ఎల్లప్పుడూ ఆరోగ్యం గురించి వాపోతూ ఉంటారు . రోగం లేక పోయినా శరీర పోషణ కై , ఆరోగ్య రక్షణ కోసం మందులను వాడుతుంటారు .
చూడం కంటే , చదివి గ్రహించడం కంటే, విని ఆనందించడం కంటే సర్వ సుఖాలను అనుభవించడంలో తృప్తి పొందుతారు . ఎక్కువ జీర్ణ శక్తి ఉంటుంది .
ప్రేమ గల వారిలో పలువురి వద్ద మెలగినా , కొన్ని సందర్బాలలో క్రుతజ్ఞ్హులుగా ప్రవర్తిస్తారు. ఎల్లప్పుడూ ఆహారం , వస్త్రాలు , నిద్రాసుఖం మొదలైన వాటిలో లోపం ఉండదు . ఏదో ఒక విదంగా సాయం అందుతూ ఉంటుంది . వీరికి ప్రత్యెక ఆకర్షణ శక్తి ఉంటుంది . ఆద్యాత్మిక రంగములొను రాణిస్తారు .
జ్యోతిషం , వశీకరణ , వైద్యం వంటి వాటిలో ఉన్నత స్తాయిని అందుకుంటారు . మనస్సులో కల్పనాశక్తి వృద్ది చెందుతుంది . కొత్త అభిప్రాయాలు రూపొందుతాయి . వాసన ద్రవ్యాలపై , రంగు రంగుల పుస్పాలపై ఆసక్తి ఉంటుంది . శారీరక శ్రమ ద్వారా కాక , బుద్ధిబలం తో వాక్చాతుర్యం తో సంపాదించ గలరు .
వీరు శరీర పటుత్వం కలిగి ఉంటారు . ప్రాణ శక్తీ మిక్కటంగా ఉంటుంది . అన్నిటిలోనూ నెమ్మదిగా ప్రవర్తిస్తారు . కీర్తి గడిస్తారు . ప్రేమ , జ్ఞానం , ప్రతిభ కలిగిన వారు . శాంతిని ఆశించే వారు . ఇల్లు, దేశం , ప్రపంచమంతా శాంతి యుతంగా ఉండాలని ప్రార్దిస్తారు . కృషి సలుపుతారు . ఇతరుల దుఃఖ ఉపశమనానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు . శుక్ర ఆదిక్యత బలంగా ఉంటె మహాత్మునిగా త్యాగ నిరతి కలిగి ఉంటారు . ఇతరుల మానాభిమానాలను కాపాడే ఆదర్శం కల వారు .
శుక్ర దృష్టి ఉచ్చంగా కల వారు వైభవ జీవితాన్ని అనుభవించాలన్న ఆసక్తి కల వారు . సుఖాలను అనుభవిస్తారు . సంతోషంగా జీవిస్తారు . కీర్తిపై మమకారం కలిగి కర్చు పెడతారు . ధన సంపాధనకై నిరంతరం శ్రమిస్తారు . లక్ష్మి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ పొంద గలుగుతారు . ఎలోపము లేక సుఖంగా జీవిస్తారు . తినడం , తిరగడం , నిద్రించడం అంటూ కలం గడుపుతారు .
వీరు కళా రంగం లో ఎక్కువగా రాణించ గలరు . రాజకియంలోను ప్రసిద్ది గడిస్తారు . క్రీడా రంగములో అభినందనలను పొందుతారు . ప్రక్యాత నటి నటులు ఈ అంకెకు చెందిన వారు . తమ మాటలను నేర వేర్చటానికి పని వారిని నియమించుకుంటారు . ప్రజల పలుకుబడితో మిక్కిలి ప్రక్యాత స్తితికి వస్తారు . చేతలు కళాత్మకంగా ఉంటాయి . మంచి వాక్చాతుర్యం , రచనా సామర్ద్యం కలిగిన వారు . వీరి జీవితం ప్రేమ మయమైనది . కామ విషయంలో అంతులేని సుఖాలను పొందుతారు . భార్యా భర్తల మద్య సెక్స్ సుఖం ప్రాదాన్యత సంతరించుకుంటుంది .
వీరు అసాధ్యమైన కార్యాలను చేస్తారు . చరిత్రలో చరగని స్తానం పొందుతారు . వీరి జీవితంలో పలువురు ఆశ్చర్య పడే విదంగా అద్భుత సంగటనలు అరుగుతాయి . శరీరంలో ఆద్యాత్మిక శక్తి బయల్పడుతుంది . వాక్కులో ప్రశాంతత ఉంటుంది . జ్యోతిష్య , వైద్య , మంత్రం సంబందమైన అంశాలలో అభినివేశం పొందుతారు .
స్త్రిలవలన పురుషులకు , పురుషుల వలన స్త్రీలకు కొన్ని అనుకూలాలు ఉంటాయి . ఈ అంకె ఆదిక్యతలో పుట్టిన వారు కళాశాల ఉపన్యాసకులు , మత ప్రవక్తలు , కవులు , నటి నటులు , రాజకీయ వేత్తలు , వక్తలు , గ్రంధ ప్రచురణ కర్తలు , పత్రిక సంపాదకులు , దూతలు , శాస్త్ర వేత్తలు , క్రీడాకారులు , వర్తకులు మొదలైన పలువురున్నారు .
మంచి ఉద్యోగస్తులు ఉన్నారు . ఆకర్షనీయ వ్రుత్తి చేయడంలో సమర్ధత వీరికి పుట్టుకతో అబ్బిన విద్య . వస్త్ర ఆభరణాలను తయారు చేయడం , అందాల కళా వస్తువులను తయారు చేయడం , రియల్ ఎస్టేట్ , బ్యుటి పార్లర్ , ఆభరణ నవరత్న వ్యాపారులు , మందులను విక్రయించడం వంటి వృత్తులు వీరికి అనుకూలిస్తాయి .
మోడల్ స్త్రీలు ఉన్నారు . సాహిత్య సంగీత సంబదిత వస్తువులను విక్రయించడం , సినిమా నిర్మాణం సువాసన ద్రవ్యాలను తయారి , తియ్యటి పానియాల తయారి ,బక్తి సంబందిత వస్తువులను విక్రయించడం , లాటరి , రేసు ,వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి .
స్త్రీలు వీరిని ప్రేమించడం కంటే , వారిపట్ల ఆకర్షితులు కావడమే ఎక్కువగా కన్పిస్తుంది . పురుషులు అందమైన స్త్రీలను , స్త్రీలు అందమైన పురుషులను వివాహం చేసుకుంటారు . అందమైన ఇల్లు , అందమైన వాహనం , ఉద్యాన వనం , వస్త్రాలు అంటూ అందానికి ప్రాదాన్యతను ఇస్తారు .
వీరిని వంచించడం అసాద్యం . శత్రువులకు యమునిగా కన్పిస్తారు . ప్రతిజ్ఞ చేసి కార్యాలను నెరవేరుస్తారు . వీరికి శాశ్వతమైన శత్రువులు ఉండరు . రోజులు గడుస్తున్నకొద్దీ వీరి ఆకర్షనీయ గుణం వలన శత్రువు కూడా మిత్రులవుతారు .
వీరికి భూమి , కాంతా కనకాలపై కోరిక ఎక్కువ . సుఖాలను అనుభవించడం వీరి ప్రధాన ఆశయం . జ్ఞాపక శక్తి , సుక్ష్మ బుద్ది కలవారు .కొన్ని సందర్బాలలో సందేహ బుద్ది , కోతిలా చాంచల్యం దుఃఖ లక్షణం కలిగి ఉంటారు .
అంతరిక్ష పరిసోధకలు , మానవాతీత శక్తులను గ్రహించాలని ఆసక్తి ఉంటుంది . వీరు ఇతరుల కరుణ , సహాయాల వలన జీవితంలో ప్రగతి సాదిస్తారు . స్నేహం దాంపత్య జీవితం గొప్పగా ఉంటుంది . ఆడంబర , అలంకార ప్రియులు . దేనిని గురించి ఆందోళన చెందిన తమ చేతల ద్వారా ఆకర్షణ ద్వారా కార్య సాదకులవుతారు . ఆడంబరంగా ఖర్చు పెట్టె లక్షణం ఉన్న వీరికి డబ్బు అనుకూలంగా సమకూరుతుంది . మనసు కష్ట పడకుండా సంతోషంగా జీవించడమే వీరి ఆదర్శం . సంసార జీవితంలో ఏర్పడే సమస్యలను తమ ఆకర్షణ శక్తితో పరిస్కరించుకుంటారు .
6 వ అంకెకు చెందిన పురుషులు సంపన్నమైన , గౌరవం కల స్త్రీని భార్యగా పొంద గలరు . భార్య అదృష్టం వలన సర్వ సౌబాగ్యాలు పొంది ధనవంతులుగా జీవిస్తారు .
6 వ అంకెకు చెందిన స్త్రీలు సంపన్నులు . సంస్కార వంతులైన భర్తలను పొంది , తద్వారా కీర్తి గాంచి సుఖంగా జీవిస్తారు .
ఈ అంకెకు చెందిన స్త్రీలు సౌభాగ్య వంతులు భోగ భాగ్యాలను అనుభవిస్తారు . కనుక వీరికి వివాహం జరుపుతున్నప్పుడు కొంత గౌరవ సంపదలున్న వ్యక్తిని నిర్ణయించడం శ్రేయస్కరం .
తమ అర్హతకు తక్కువైన మగాడితో వివాహం జరిపిస్తే తప్పుడు మార్గంలో ప్రవేశించి సంపదను ఆర్జించడానికి ఆశిస్తారు . వీరికి కామ దోషం ఉంటుంది . కామ క్రోద పసువులవుతారు .
ఈ అంకెలో జన్మించిన స్త్రీ పురుషులు ఇరువురు తమకంటే ఉన్నత స్తితిలో ఉన్న వారిని వివాహం చేసుకుంటారు . గుణ సంక్య , శరీర సంక్య అనుకూలంగా ఉన్న వారికి అందం , తెలివి , గౌరవం గర్భ కాలం లోనే సంప్రాప్తం అవుతాయి . వీరిని చూసి ఇతరులు దిగ్బ్రమకు లోనవుతారు .
అందమైన వస్తువులను కొనుక్కుంటారు . తమ రూపు రేఖలను మేరగు పరచుకోవడానికి ప్రయత్నిస్తారు . సంగీత సాహిత్యాలలో పరిచయం ఎక్కువగా ఉంటుంది . వీటిలో ఎక్కువ పాండిత్యం గడించి ఉంటారు . అన్ని విషయాలలోనూ ఆడంబరాన్ని ప్రదర్శిస్తారు . వినోదాలు,బోగాల ప్రతి నిధి అయిన శుక్రుని ఆదిక్యంలో జన్మించిన వీరికి లైంగిక అనుబూతులు ఎక్కువగా ఉంటాయి . పోరాడి విజయం పొందడం కంటే బుద్ది సూక్ష్మతకు సంబందించిన విజయం వీరికి ఇష్టం .
వీరు ప్రవేసించే ప్రతి సఖలోను విలక్షణత ప్రదర్శిస్తారు . ధైర్య గుణం కల వారు . వీరి మనస్సు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది . వీరు ఒక నిర్ణయానికి వస్తే దానిని మార్చడం ఎవరికీ సాద్యం కాదు . పట్టుదల తోడుగా విజయం సాదిస్తారు . వీరికి పుట్టుకతో అలవడిన కోపం వస్తే ఎవరితోనైనా గొడవ పడగలరు .
ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు . మంత్రం తంత్ర శక్తులలో ప్రవేశం ఉంటుంది . విజయ సాధనకై మూల మంత్రాలను ఉచ్చరిస్తారు . పురుషులు స్త్రీలు ఋ వర్గాలలోను మిత్రులుంటారు . ప్రజాసమూహాన్ని ఆకర్షించి దేశాన్ని పాలించే శక్తీ వీరికి ఉంటుంది . రాజ్యతంత్రజ్ఞులు .
ప్రవేటు కంపెనీలలో ఉద్యోగం , ప్రభుత్వ ఉద్యోగం , సొంత వ్యాపారం , ఏదైనా కళాత్మక వ్రుత్తి వీరికి లబ్యమవుతుంది . వీరు అనుకూలమైన సంక్యా బలం ఉన్న జీవిత భాగ స్వామిని ఎన్నుకుంటే మిక్కిలి అభివృద్ధి పొందుతారు . వీరి రూపం అందంగా ఉంటుంది . వయస్సు మీరిన పిదప కుడా అందంలో మార్పు లేకుండా కన్పిస్తారు . తరచుగా ప్రయాణాలు , విదేశా ప్రయాణాలు ఉంటాయి .
గణితంలో ప్రతిభ , సాహిత్య పరిచయం కలిగి ఉంటారు . సంబాషణల ద్వారా ఏపని నైనా నిర్వహించ గలరు . వీరు సృసించిన ప్రతి అంశము రాణిస్తుంది . పూర్వికుల ఆస్తులు తోడ్పడతాయి . ఈప్రపంచ వినోదాల నిలయంగా భావిస్తారు .
సినిమా రంగములో సాటి లేని విజయాలు పొందగలరు . వీరి సినిమా నిర్మాణాలకు ప్రజల మద్య మంచి ఆదరణ ఉంటుంది . సంపన్న జీవితం అనుభవిస్తారు .
వ్రుత్తి ప్రగతి సాదిస్తారు . ఆలోచనా తత్పరులుగా ప్రసిద్ది గాంచుతారు . శరీర అవయవాలు కాళ్ళ తోబాటు కదలిక పొంద గలవు .ప్రఖ్యాథి గాంచిన రంగములో ప్రాముక్యత పొందుతారు . మానసిక శక్తుల ద్వారా ముందుగానే జరగా బోతున్న సంఘటనలను గ్రహిస్తారు . వాహన ప్రయాణ ప్రియులు . చురుకుగా మనస్సు మెచ్చే ప్రాంతాలను దర్శించి సంతసిస్తారు . ఆద్యాత్మికంగా ప్రత్యేకత కనపరుస్తారు .
55 ఏళ్లకు తరువాత కొందరు యోగులుగా , జ్ఞానులుగా జీవితం గడుపుతారు . తెలివి తేటలు ఎక్కువగా ఉంటుంది . ఎందులోనూ చురుగ్గా వ్యవహరిస్తారు . పండ్లను ఇష్టపడి స్వీకరిస్తారు . యవ్వనం తగ్గని ముఖంతో కన్పిస్తారు . పెద్దల సాయం , సంపన్నుల స్నేహం లభిస్తుంది . గొప్పగా జీవిస్తారు .