Numerology. 5 వ సంక్యవారి పలితాలు


                                     


 

5 వ సంక్యవారి పలితాలు

 అంకె 5 – బుధుడు

 కళలకు అధిపతి[ సృష్టి కర్త ]

   5,14,23తేదిలలో జన్మించిన వారు తేది , నెల , సంవత్సరము కలిపినా మొత్తం 5 వచ్చిన వారు బుధ ఆదిక్యత లో పుతిన వారు .

 స్వభావాలు – లక్షణాలు

         ఈ అంకె పాలనా దక్షత కలది . అన్నిటిలోనూ రాణించ గల శక్తీ కలిగిన ది . పంచ బూతాలు నీరు , నిప్పు , గాలి , మన్ను , మిన్ను , పంచేంద్రియాలు కళ్ళు , చెవి , ముక్కు , నాలుక, చర్మం పాండవులు ఐదు గురు , ఆయుర్వేదంలో ఉత్తమ ఔషదాలు ఐదు ,జ్యోతిష్య శాస్త్రంలో ఐదు అంగాలను విశదీకరించే గ్రంధం పంచాంగం .

        తొమ్మిది గ్రహాలలో 5 అయిన బుడుడు మధ్యముడు . అన్నిటిలోనూ సాటి లేని భలం చూప గలిగినది . ప్రజలను ఆకర్షించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది . [ప్రజాశక్తి ]అన్ని విషయాలలోనూ ప్రవేశం ఉంటుంది .

         ప్రసిద్ది గాంచిన వ్యక్తులుగా ఉంటారు . దేశ ప్రజలను ఆకర్షించే  శక్తీ వీరికి ఉంటుంది . ప్రజాకర్షణ కల అంకె . ప్రజాబలం , ధన భలం , రెండు వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి .

         ఇతరులు చేయలేని పనులను చేయగలరు . ప్రజా సంబంధం గల వృత్తులను ఆచరించి రాణిస్తారు . ఇంద్రియాలను అదుపులో ఉంచగల శక్తీ ఉంటుంది . ఆత్మవిశ్వాసము సడలని సిద్దాంతము కల వారు . కళలను ఆకర్షించే ముఖము కల వారు . దీర్గాలోచన కల వారు . ఆచరించే పనులలో విజయం సాదిస్తారు .

       చురుకైన వారు . అన్నిటిలో వేగం ఉంటుంది . మెదడు మెరుపు వేగం తో పని చేస్తుంది . అన్నిటిలోనూ చురుగ్గా వ్యవహరించి ఆగ్నాపించగల స్తాయిలో ఉంటారు . గాంబీర్య లక్షణం కలవారు . నిత్యోత్సాహులు , కళలలో అభినివేశం ఉన్నవారు .

       బుడ్డి సూక్ష్మత కల వారు . నూతన అభిప్రాయాలు మనస్సులో పొడ చూపుతుంటాయి .ఇతరుల సమస్యను తమ మెరుపు వేగ ఆలోచనలతో పరిష్కరిస్తారు . ఇతరులకు హితం చెప్పడంలో సిద్ద హస్తులు . ఇతరులు ఎన్నో రోజులు ఆలోచించే చేయ గల పనులను వీరు వెంటనే చేసి విజయం సాదిస్తారు .

          తమ ప్రతిభను ఎవరు గుర్తించడం లేదని కొన్ని సమయాలలో బాద పడతారు . తమ ఎదుగుదల తమకు సంబందించిన వారి మంద బుద్ది కారణంగా నిలిచి పోతున్నదని చెప్పుకుంటారు . వినూత్న అభిప్రాయాలను వ్యక్తికరిస్తుంటారు .  వీరి అభిప్రాయాలు నిలకడ అయినవిగా ఉంటాయి . వీరు దివంగతులైనా దేశ ప్రజలకు మార్గ దర్సకులవుతారు .

      ప్రపంచం మందంగా సాగుతుందని భావిస్తారు . విషయమేదైనా  వెంటనే గ్రహిస్తారు . సమస్యాత్మకమైన వాటికి వీరు పరిష్కారం చూపగలరు . వీరి మనస్సు , శరీరం అంతటా అతీత శక్తీ వ్యాపించి ఉంటుంది . ఇటువంటి శక్తిని వారు గ్రహించగలరు . ఇతరులకు వీరు తొందర మనుషులుగా అన్పిస్తారు .  యంత్రం లా పరిబ్రమిసుంటారు .

         బయటి ప్రదేశాలకు వెళ్లి రావడంలో ఎక్కువ ఇష్టం ఉంటుంది . త్వరగా అభివృద్ధి చెందడం లో ఆసక్తి కనపరుస్తారు . ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు . హాస్యం కలిగిన మాటలు , పసి బిడ్డ వంటి చేష్టలు ఉంటాయి .. ఎవరితోనైనా త్వరగా కలసి పోతారు . వారి అంతర్గత వ్యవహారాలను గ్రహిస్తారు .

           వాస్తవ దృక్పదం కలవారు . మనస్పూర్తిగా మాట్లాడతారు . మనస్సులో అభిప్రాయాలను వెంటనే బయట బేడతారు . కల్మష రహితులు . దాపరికం లేని వారు . వీరి చుట్టూ ఉన్నవారికి వీరి అంతరంగిక విషయాలన్నీ తెలిసి ఉంటాయి . దైవానుగ్రహం పొందిన వారు

           మాటిమాటికి పధకాలను మార్చుకుంటారు . ప్రాచిన మైన వాటిని ఇష్ట పదారు . కొత్తదనం, విప్లవ దృక్పదం ఉన్నవారు . పరిశోదనా పరులు . కొత్త నాగరికతను వెంటనే ఆహ్వానిస్తారు .

        ఇతరుల వలె పుట్టి , పెరిగి , ఎదోవిదంగా బ్రతకడం అన్న దృక్పదం కాక మానవ హితాన్ని ఆశించి జీవిన్చాలనుకుంటారు . ప్రపంచ జనుల పరివర్తనకై కొత్త సిద్దాంతాలను ప్రచారం చేస్తారు .

        గొప్ప పనులనైనా సునాయాసంగా ముగించ గలము అన్న విశ్వాసము కల వారు . ఎపనిలోనైనా జంకు కాని , భయం కాని లేకుండా సాహసోపేతంగా ప్రవర్తిస్తారు .

    జూదం, రేసులు వంటి వాటిలో విజయం తప్పని సరిగా లబిస్తుందని పాల్గొంటారు . కొందరు అడ్డ దారిలో త్వరగా ప్రగతి సాదించ వచ్చని విశ్వసిస్తారు .

        మనం ఇలా ప్రవర్తించి ఉండకపోతే అభివృద్ధి చెంది ఉండలేమని అభిప్రాయ పడతారు . ఇతరులకంటే భిన్నమైన అభిప్రాయాలూ కలిగి ఉంటారు . సదా ఆశయం కల వారు .

       ఓటమికి వెనుక అంజ వేయరు . దానిని జయించే మార్గాన్ని అన్వేషిస్తారు . ఆత్మస్తైర్యం ఉన్నవారు . ఆత్మ విశ్వాసంతో  దేనినైనా ఎదుర్కోగలరు . ఓటమి, దుఃఖం లేని జీవితం , వీరికి కలిగి ఓటములు సైతం వారి మంచి కోసమే నని పరిసీలించినానంతరం తెలుస్తుంది .

       వీరి బుద్ది ఆత్మ శక్తి వలన ప్రేరణ పొందుతుంది . మనసులో జనించే ఉత్తమాభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తే సంపూర్ణ విజయం లభిస్తుంది . తమ ఇష్ట ప్రకారం పనులను  ఆచరించి విజయం పొందుతారు .

         శారీరక బలం కంటే బుద్ది బలం  ఎక్కువ కల వారు . వీరి బుద్ది హెచ్చరించడం ద్వారా అపాయాల బారి నుంచి తప్పించు కుంటారు . మనస్సులో ఒక రకమైన ఆకర్షణ శక్తీ , మాయా శక్తీ , మిళితమై ఉంటుంది . ఆ శక్తీ కారణంగా సమస్యలను ముందుగానే తొలగించు కుంటారు .

         సమాజ జీవితం , రాజకీయం , కళల పట్ల మంచి అవగాహన ఉంటుంది . కొందరు వీరిని తమాషా వ్యక్తీ అని , ఆటలాడే పసి మనస్కులని భావిస్తారు . తమ హాస్య ధోరణిలో ఇతరులతో కలసి పోతారు . ఇతరులకు నవ్వించడమే కే ఆలోచింప చేస్తారు . మనస్సు లోని భావాలను ఆచరణలో చూపిస్తారు . డబ్బు సంపాదించడం లో ఆసక్తి , ప్రతిభ కల వారు .తప్పు చేసిన వారిని దండించడం  కంటే క్షమించడం మంచిదన్న అభిప్రాయం కల వారు . ఇందువలన ఇతరులు వీరిని అభి నందిస్తారు .

         వీరు అక్రమ మార్గాలలో , జుదాది వ్యవహారాల ద్వారా సంపాదించాలా అనుకోవడం భావ్యం కాదు . అలా ప్రవర్తిస్తే తొలుత విజయం కలిగి తరువాత  అదః పాతాళం  లోకి పద వేస్తుంది

  వీరు ప్రతి పనిలోనూ నూతనత్వాన్ని ఇష్ట పడతారు . ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని ప్రముక్యతను ఇస్తారు . చిరు ప్రాయంలో సైతం ఒక రోజు నచ్చ్చిన ఆట సామానులు , తిను బండారాలు బట్టలు మరుసటి రోజు ఇష్టపడని నైజం కల వారు .

        పారిశ్రామిక రంగం , ఉద్యోగం , మిత్రులు , అలవాట్లు మొదలైన ప్రతి విషయాలలోనూ  మార్పులు కోరుకుంటారు . వృత్తిలోను నూతనత్వాన్ని ఇష్టపడతారు . ఉద్యోగస్తులు చోటును , పరిసరాలను తరచుగా మార్చుకుంటారు .

        ఒకే వృత్తిని జీవితాంతం చేయడం వీరికి అలవాటు లేదు . మంచి ఆదాయము ఉన్న వ్రుత్తినైనా మార్చుకుంటారు . కొందరు ఆద్యాత్మిక సంబందమైన వృత్తులను చేపట్టి యౌవనం లోనే కీర్తిని సంపాదించుకుంటారు . ప్రయాణం చేయడం అంటే ఆసక్తి ఉంటుంది . తరచుగా వినోద యాత్రలు చేస్తారు . ప్రకృతి దృశ్యాలను చూడడం చారిత్రిక ప్రసిద్ది గాంచిన స్తలాలను దర్శించడం వీరికి అభిమాన విషయాలు .

         పుణ్య స్తల దర్సనం వీరి అభిరుచి . దైవ ప్రార్దన ప్రత్యేకంగా ఇష్ట పడతారు . వీరి ప్రార్ధనా ధోరణి ఇతరులను ఆశ్చర్య పరుస్తుంది . విదేశి యానం చేస్తారు . కొత్త చోట్లను సందర్శిస్తారు .

         రేపటి ప్రపంచం మనదేనన్న దీమా కల వారు . మరుక్షణం చేయ బోతున్న పని ఏమిటన్నది వీరెరుగరు . వీరిలో నిగూదంగా  ఉన్న ఆద్యాత్మిక శక్తీ కారణంగా వీరికి కలుగుతుందనుకున్న అపాయాలని ఆశ్చర్యంగా తప్పించుకుంటారు .

        వీరి అంతర్గత అనుబూతులకు ప్రాముక్యత నిచ్చి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే గొప్ప కార్య దక్షులు కావడం అక్షర సత్యం . శారీరక శ్రమ కంటే భావ [ బుద్ది ] పరిశ్రమను ఇష్ట పడతారు .

         శారీరక శ్రమ లేకుండా బుద్ది సూక్ష్మత ద్వారా సంపదను పెమ్పొంచించ వచ్చని వీరి దృడ విశ్వాసం . డబ్బు గడించడంలో సమర్ధులు . డబ్బు సంపాదించడానికి తగిన పదకాలు వీరి మనస్సులో పుడుతూ ఉంటాయి . పెద్ద పెద్ద పధకాలను .  రూపొందిస్తూ ఉంటారు .

     మనస్సులో మార్పు త్వరగా సంబవిస్తుంది , ప్రేమ వ్యవహారాలలో ఆసక్తి మిక్కటం . ఒకరిపై ప్రేమాభిమానాలు ఎక్కువ కాలం ఉండవు . నిన్న ఇష్ట పడిన వారిని ఈ రోజు ద్వేషిస్తారు . పువ్వు పూవుకు పరిబ్రమించే తుమ్మెద వంటి వారు .

      సమాజంలో మార్పు రావాలని ఎలుగెత్తి చాటుతారు . అత్యాడునిక వస్తువులను కొనుక్కుంటారు . ముందు రోజు వాడిన వస్తువు మరుసటి రోజు మరుసటి రోజుకు  పాతది అన్పిస్తుంది . కొత్తదనాని ఆహ్వానించే విప్లవ కారులు . ఎ గొడవలోను తగులు కోకుండా చేపలా జరుకుంటారు . ఇది వీరి ప్రత్యెక లక్షణం .

       5 అంకెకు చెందిన వారికి  గ్రహణ శక్తి ఉన్నందున చిరు ప్రాయంలో ఎవరితో స్నేహం చేస్తారో వారి అలవాట్లను గ్రహించి అలాగే ప్రవర్తిస్తారు . ఇతరులను ఆకర్షించ గలరు .

      చిన్న వయసులోనే మంచి అలవాట్లను నేర్చాలి . మంచి వారితో స్నేహం అలవారచాలి . దుష్ట సహవాసం చేసినట్టైతే పెరిగిన తరువాత దుర్మార్గుల గానే ప్రవర్తిస్తారు . తల్లి దండ్రుల సద్వర్తనులు అయినా , పిల్లలలో మార్పు ఉండదు .

       శ్రద్దగా పెంచడం ద్వారా సద్వార్తనులను చేయ వచ్చును వీరికి కామం ఎక్కువ . సామాజిక నిబందనలను అధిగమించి అక్రమ కామ కలాపాలకు పూనుకుంటారు . తొందరపాటు ప్రేమ వివాహం చేసుకొని ఆపదలో  చిక్కుకున్న వారున్నారు . వీరు వివాహ విషయాలలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి . లేనట్లయితే జీవితం కష్టాల మయం అవుతుంది . శత్రువులతో నిండిన కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది .

        వివాహ సందర్భంగా నిర్ణయం సుదీర్గ ఆలోచనకు పిదప తీసుకోవాలి . పురుషులు స్త్రీల గురించి , స్త్రీలు పురుషుల గురించి బాగా ఆలోచించాలి . ఈ అంకె వ్యక్తులకు చుసిన క్షణమే ప్రేమ పుడుతుంది . దీనిని అదుపులో ఉంచుకుంటే జీవితం చెక్కగా ఉంటుంది .

     వీరికి జీవిత బాగా స్వాములుగా పొందిన వారు వీరి స్వభావాలను చక్కగా గ్రహించి , వీరి మనస్సుకు తగినట్లు ప్రవర్తించి , చక్కని దుస్తులను దరించి , నిత్య నూతనంగా వ్యవహరిస్తే ఆకర్షించడం , అభిమానం పొందడం సులభం .

    పొగడ్తలను  ఇష్టపడతారు . ఇతరులు పొగడగానే తమ్ముతాము మరచి పోతారు . ఇతరులు వీరిని నమ్మదగని రీతిలో పొగడినా నిజమనుకుంటారు . ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నవారు . వీరిని తగిన రీతిలో ఉపయోగించుకుంటే సులభంగా ఏపని నైనా నిర్వహించ వచ్చును .

         వీరి ప్రేమాభిమానాలు తరచుగా మార్పుకు లోనవుతారు . ధైర్యం ఉన్న వారు . ఓటమిని చూసి క్రుంగి పోరు . మనస్సులో కష్టం కలిగినా వెంటనే సర్దుకుంటారు . మనోవేగం మెరుపు వేగం తో సమానంగా ఉంటుంది . లోక జ్ఞానం అనుభవ జ్ఞానం కలిగినా వారు .

          వీరి ముఖంలో ప్రత్యెక ఆకర్షణ ఉంటుంది . అదృష్టం యొక్క ఆదరణ వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది . స్తిరమైన ఆదర్సమంటూ  ఉండదు . అయినా అసాదారణమైన మనస్తైర్యం కలిగి ఉంటారు .  దనం ఏదో రూపం  లో  వస్తు ఉంటుంది . చేతిలో సంచిలో ఒక్క రూపాయ కూడా లేదనుకుంటున్న సమయం      లో ఏదో ఒక మార్గం లో డబ్బు సమకూరుతుంది . కళాత్మక హృదయం ఉన్నవారు . కనుక కావ్య నిర్మాణం చేయగలరు .

        తేది, నెల, సంవత్సరం  కలిపినా మొత్తం సంక్య 5 కలిగిన వారికి తేది అంకెకు అనుగుణంగా లభిస్తాయి .

        5,14,23 తేదిలలో జన్మించిన వారు  ఆరంబం యవ్వనం అంతా , పలుకుబడి , సంపద కలిగిన వారై ఉండి చివరి రోజులు మొత్తం సంక్య కు అనుగుణమైన ఫలితాలను పొందుతారు .

       వీరు  కళల  సంబందమైన వృత్తులలో రాణిస్తారు . ప్రజాదరణ కలిగిన వారైనందున రాజకీయాలలో ప్రవేశించి అనేక విప్లవాత్మకమైన మార్పులకు కారకులవుతారు . సినిమా రంగంలో నటన , దర్సకత్వం , శబ్ద గ్రహణ , కదారచన శాఖలలో ప్రసిద్ది పొందుతారు .

        పెట్టుబడి లేకుండా చేసే కమిషన్ , కాంట్రాక్ట్  వృత్తుల వలన లబ్ధి ఉంటుంది . నాగరిక వస్తువులను తయారు చేయడం , వస్తు మార్పిడి వర్తకం చేయడం ద్వారా డబ్బు గడిస్తారు . ఆదర్శ వంతంగా వ్రుత్తి నిర్వహించే దృక్పదం కల వారు .

కళలలో అభినివేశం , కావ్యం ,చిత్రలేఖనం ,  సంగీతం , గణితం , విజ్ఞాన శాస్త్రం , ఆద్యాత్మిక , జ్యోతిష్య రంగాలలో ఎక్కువ ఆసక్తి , పరిజ్ఞానం కలిగిన వారు . జీవితంలో ప్రగతి సాదించాలన్న పట్టుదల కల వారు . వైభవాలకు ఎక్కువ కర్చు పెడతారు . మాటల ద్వారా రచనల ద్వారా ఇతరులను ఐస్కాంతం లా ఆకర్షిస్తారు . హటాత్తుగా డబ్బు చేరుతుంది . తుచ్చ సుఖాలకు సుఖ జీవితానికి , అలవాటు పడతారు .

     కొన్ని సందర్బాలలో చెడు మార్గాలలో త్వరగా డబ్బు గడిస్తామని భావిస్తారు . కాని ఓటమి , దూర ద్రుష్టాలు వెన్నడుతాయి .

      ఉన్నత ఆదర్శాలతో చేపట్టిన సమస్త కార్యక్రమాలు విజయ వంటమవుతాయి .  నిజాయితీ మంచి అలవాట్లు ఉన్నట్లయితే సౌబాగ్య ప్రదమైన జీవితం లభిస్తుంది .

      వీరికి అసహనం, దుఃఖం అన్ని అనుభూతులు క్షనికమైనవి . వెంటనే సహజ స్తితికి చేరుకుంటారు . ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు . వీరి మనస్సుకు ఎక్కువ శ్రమ కలగడం వలన అసహనం కోపం కలుగుతుంది . చేపట్టిన అన్ని పనులు పూర్తి చేస్తారు .

      ఈ అంకెకు చెందిన వారు ఒక సంస్తలో ఉద్యోగం చేస్తూ ఉంటె వీరి అదృష్టం ఆసంస్తకు కూడా చెందుతుంది . ఈ అంకె వ్యక్తులను ఉపయోగించుకుంటే అభి వృద్ది ఉంటుంది . వీరున్న చోట జన సముదాయం ఉంటుంది . ప్రపంచంలోని సుఖాలను , ప్రేమ వ్యవహారాలను అనుభావిచడంలో ఎక్కువ సంతోషం పొందుతారు . తాము చేపట్టిన పనులను ముగించే అంట వరకు నిద్ర పోరు .

       మిక్కిలి సుక్ష్మ విషయాలను గ్రహించడానికి వీరి మనస్సు ఆసక్తి చూపుతుంది . ప్రతి దానిని తరచుగా మారుస్తుంటారు . తమ ప్రవర్తన , వస్త్ర ధారణ , అభిరుచులు , నివసించే ఇంటిలో కొత్త మార్పు , కార్యాలయాలలో మార్పు , చేస్తున్న వ్రుత్తి వ్యాపారం , స్నేహితులు , ప్రేమ వ్యవహారం ., వంటి అన్ని విషయాలలోనూ , కొత్త మార్పులను చేస్తుంటారు . అలా చేస్తేనే ప్రశాంతంగా ఉండ గలరు . శాస్త్రీయ కారణాలను , తార్కికంగా  విశ్లేషిస్తూ వాటిని మార్పు చేస్తూ ఉంటారు . ఆద్యాత్మిక ఉచ్చారణ , మంత్ర శక్తి వంటి అపూర్వ శక్తులు వీరి శరీరం అంతటా ప్రసరించి ఉంటుంది .

         వేగంగా ఆలోచించినా మంచి నిర్ణయం తీసుకుంటారు . అన్నిటి లోనూ పోరాటం లా ప్రారంబంయ్యే వీరి జీవితం క్రమంగా విజయ పదం వైపు సాగుతుంది . బందువుల కంటే మిత్రులు ఎక్కువగా ఉంటారు . ఇతరులను ఉపయోగించు కొని తమ పనులను చేసుకోవడంలో సమర్ధులు .

    ఇతరుల జోక్యాన్ని ఇష్ట పడక తమ పనులను స్వేచ్చగా నిర్వహించాలని భావిస్తారు . ఇతరులు వీరిని మర మనుషులుగా భావిస్తారు . ఖర్చు చేయడం ఎక్కువ . కలల పట్ల , తత్వ పరిశోధన పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది . రాజకీయాలలో కొత్తదనం , సమాజంలో పలు సంస్కరణలను చేపడతారు . ఉద్విగ్న మనస్కులు . శాశ్విత కీర్తి ఉంటుంది . తరంగాల వంటి ఆలోచనలు తుఫాన్ వంటి విజయాలు కలుగు తాయి