4వ సంక్యవారి పలితాలు
అంకె 4 -రాహువు
రాజ లక్షణాలు కలవాడు
ప్రతి నెల 4-13-22-31 తేదిలలో జన్మించిన వారు మరియి తేది , నెల ,సంవత్సరం మొత్తం కలిపిన 4 సంక్య వచ్చిన వారు 4 అనే రాహు ఆదిక్యతలో జన్మించిన వారవుతారు .
లక్షణాలు – స్వభావాలు
చతురస్రం నాలుగు కోణాలు కలది . వేదాలు నలుగు . అనుభవజ్ఞులను నలుగు తెలిసిన వారు అంటాము . దిక్కులు నాలుగు , మూలలు నాలుగు . ప్రపంచ బ్రమణ ము లో నాలుగు అన్నది ముక్య పాత్ర వహిస్తున్నది .
రాజకీయం , రాజ్యాంగ శాసనం , సామాజకోన్నతి , కొత్త వికాసం చూడడం , ధర్మ పరిరక్షణ అన్న అంశాలకు ఆధారమైనది నాలుగు అన్న అంకె .
సృష్టి కర్త అయిన బ్రహ్మ వీరి వ్రుదయాలలో కొలువుంటాడు . దేశానికి దేశ ప్రజలకు కొత్త సిద్దాంతాలను బహిర్గతం చేయగలవారు . స్వేచ్చా జీవులుగా విహరించ గలవారు . స్వాతంత్రియ ప్రియులు . మనస్సులో కొత్త ఆలోచనలు పుడుతుంటాయి . వీరు లేని శాఖ అంటూ ఏది ఉండదు . అన్ని రంగాలలోను రానించగలరు .
పార్లమెంటు, శాసన సభ, రాజకీయం , సినిమా , క్రీడలు , పత్రికా రంగం , గోపురం మొదలు పూచిక పుల్ల వరకు , భావనాలలోను , గుడిసేల్లోను , అన్ని చోట్ల వీరిని చూడ వచ్చును . ఎల్లప్పుడూ లోక వ్యవహారాలను పరిశీలిస్తూ ఉంటారు . ఎల్లప్పుడూ ఇతరులతో ఏదో ఒక కార్యం గురించి ఆసక్తి తో మాట్లాడుతుంటారు . కొత్త చోట్లకు వెళ్లి రావడం లోను , తరచుగా బయటికి ఊల్లకు ప్రయాణం చేయడంలో ను ఇష్టం చూపుతుంటారు ప్రపంచ సంచారం వీరికి ఆసక్తి దాయకం .
ప్రకృతి దృశ్యాలు , పక్షులు , రంగు రంగుల పూలు , అద్భుత మృగాలు వంటి వాటిని చూడటం వీరికి ఆనందం కలిగిస్తుంది . చారిత్రిక ప్రసిద్ది గాంచిన స్తలలను దర్సిస్తుంటారు .
వీరి అభిప్రాయాలను చక్కగా , స్పష్టమైన వర్ణనలతో ఇతరులకు చెప్పగలరు . ఇతరులు ఏమనుకుంటారో అన్న విషయం గురించి లక్ష్య పెట్టరు . వీరి అభిప్రాయాలు పలువురికి ప్రయోజన కారిగా ఉంటాయి .
ప్రపంచం లోని అన్ని విషయాలను తెలుసుకుంటారు . ఇతరులకు తెలియని విషయాలను అర్ధం అయ్యేవిదంగా వివరించ గలరు . పేదలకు సాయపడి తృప్తి పొందుతారు . అతీత శక్తులపై ఎక్కువ నమ్మకం కలిగి ఉంటారు .
ఈ అంకె వ్యక్తులు బుడ్డి సూక్ష్మత కల వారు . ఇతరులలోని మర్మాన్ని త్వరగా గ్రహించ గలరు . పలు విషయాలు ఎరిగిన మంచి మనిషిగా ప్రసిద్ది పొందుతారు . విద్యలో రాణిస్తారు .
పుట్టిన తేది ఏదైనా మొత్తం సంక్య 4 అయిన వారికి జీవితం లో మార్పులు, విజయం, వృత్తికి సంబందించిన ప్రగతి ప్రవేశం వంటి అంశాలు 4 అనే మొట్ట సంక్యను అనుసరించి జరుగుతాయి . 4 ఆదిక్యతను లోనై ఉంటారు
విజయం సాదించిన వ్యక్తులుగా , ఎగిసి పడే సింహాలుగా ఉంటారు. సహనం కల వారుగాను, ఓటమిని చూసి క్రుంగి పోనీ దృడ చిట్టులుగాను ఉంటారు రాజ్య తంత్రులై ఉంటారు . అర్ధం కాని వారికి సమస్యగా అర్ధమైన వారికి మంచి సలహాలనివ్వగల విగ్నులుగా కన్పిస్తారు .
మంచి వక్తలు . ప్రజలకు సాయపడతారు . శాస్త్రాలు , గణితం , వైద్య రంగాలలో ప్రసిద్ది పొందుతారు. ఇతరులకు లోబడి జీవించరు. తమ అభిప్రాయాలను అక్షరాల ద్వారా [రచనలు ] బహిర్గతం చేస్తారు ఽఅత్మ విశ్వాసం కల వారు .
వీరిలో కొన్ని సందర్బాలలో కోపం బహిర్గతం అవుతుంది . వెంటనే శాంతి స్తారు . కోపాన్ని అదుపులో ఉంచుకొని జీవిస్తే ఉన్నత స్తితిని పొందగలరు .
ఎ అలవాటు బానిసగా ఉండదు . వీరు మెరుపు వేగం తో సమాదానం ఇవ్వగలరు . వెళ్ళిన చోట్లలో మంచి ఆహ్వానం ఉంటుంది . గౌరవింప బడతారు మాటలో తీయదనం కంటే కాటిన్యం ఉంటుంది .తమ రచనలు , మాటల ద్వారా ప్రపంచాన్ని సంస్కరించాలని ప్రయత్నిస్తారు .
మంచి అభిప్రాయాలను వెలి బుచ్చుతారు . తాము నిజమని నమ్మిన వాటిని పాటిస్తారు . ఇరరుల అభినందనలు , నిందలను గురించి లెక్క చేయరు .
ప్రారంబ జీవితంలో తీవ్రవాద లక్షణాలు కన్పించినా కాలక్రమంలో అనుభవం ద్వారా లోపాలను సరి దిద్దుకొని మంచి మానసిక లక్షణాలతో పలువురు కన్పిస్తారు . అనుభవంతో వీరి జీవితం కుడా ఉన్నతి పొందుతుంది .
ఇతరుల అభిప్రాయాలకు వెంటనే వ్యతిరేక అభిప్రాయాలను తెలుపుతారు . తమ అభిప్రాయాలను స్తిర పరచాలని ఆశిస్తారు . ఇతరుల అభిప్రాయాలను పరిశీలించ కుండా గ్రహించరు. దేనినైనా బాగుగా పరిశీలించి , ఆలోచించిన పిదపే నిర్ణయానికి వస్తారు .
ఏపని గురించి అయినా ప్రత్యెక అభిప్రాయం కలిగి ఉంటారు . ఆ విలక్షణ అభిప్రాయాన్ని రహస్యంగా ఉంచుకొని కార్య సాధనకు పూనుకుంటేనే విజయం సాద్యమౌతుంది . లేనట్లయితే అనవసర శత్రుత్వం పెరుగుతుంది .
పవిత్ర ఆలోచన , కరుణా హృదయము ,అందరిని మిత్రులుగా భావించే ప్రవర్తన కలిగి ఉంటారు . ఎక్కడకు వెళ్ళినా మంచి స్నేహితులను సమకూర్చు కుంటారు . స్నేహానికి లక్షణంగా కానీ పిస్తారు . వెళ్ళిన చోట్ల స్నేహితులు ఉంటారు .
అయినా 4 వ అంకె వ్యక్తులు పలువురికి ఎక్కువ మంది స్నేహితులు ఉండడం లేదు . వీరందరితో స్నేహం చేసినా మనస్పూర్తిగా గాఢ స్నేహాన్ని కోరుకుంటారు . కొందరికి మాత్రమె ఆస్తానాన్ని కల్పిస్తారు . స్నేహితులకి సాయం చేసే గుణం కలిగి ఉంటారు . మంచి బుద్ది మంతులు.
యౌవనం లోనే జీవిత రహస్యాలను గురించి లోతుగా పరిసోదిస్తారు . కధలు , కావ్యం , చిత్రలేఖనం ,ఆద్యాత్మిక , సాహిత్య , కవిత్వ , విజ్ఞాన శాస్త్ర గ్రందాలు వీరిని ఆకట్టుకుంటాయి . వీరి మనస్సు అన్ని రంగాల గురించి తెలుసు కోవాలని ఆరాట పడుతుంది . ఆద్యత్మికంగా మంచి పట్టు , ఆచార వ్యవహారాలలో దైవ స్తుతి లో విలక్షణత్వాన్ని పాటిస్తారు .
స్నేహితుల వలన లబ్ది పొందుతారు . కీర్తి కాంక్ష ఉండదు . మనస్సు శాంతితో జీవిస్తారు జీవితమ్ లో అనుభవించ గల సుఖాలన్నింటిని అనుభవించాలని కోరుకుంటారు . ఆహార విషయం లో జాగ్రత్త వహిస్తారు . అన్నం , అల్పాహారం , మసాలా దినుసులపై ఆసక్తి ఎక్కువ .
శరీరంలో వ్యాదులు లేక పోయినా సరిరం చురుగ్గా ఉండడానికి , ముఖం ప్రకాశ వంతముగా ఉండడానికి , ఎక్కువ ఆయుషు కోసం మందు మాత్రలు , టానిక్ , ఇతర మూలికా వైద్యం ,పాటించ వచ్చునా అని ప్రశ్నిస్తారు .
వీరు సరిర అనారోగ్యం కంటే , మానసిక రోగం తోనే ఎక్కువ ఇబ్బంది పడతారు . ఇతరుల కటిన వాక్కు , అవమాన కర ప్రవర్తన , వీరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది . సిగ్గు , అభిమానం ఎక్కువ కల వారు .త్వరగా మానసికంగా క్రుంగి పోతారు. త్వరగా అనుభూతులకు లోనౌతారు . దయాగుణం కల వారు .
మంచి చెడ్డలు రాక పూర్వమే అడ్డుకోగల మనోభాలం కల వారు . అందరిలోనూ గౌరవ ప్రదంగా ప్రవర్తిస్తారు . శ్రమ పడి డబ్బు సంపాదిస్తారు . కొద్ది కొద్దిగా సంపాదించే గుణం ఉన్నవారు . కష్టించి చేర్చిన డబ్బును నాగరికంగా , ఆడంబరంగా ఖర్చు పెడతారు .
డబ్బు ఖర్చు పెట్టడంలో ఒక విదమైన గౌరవం , ఆస వీరిలో ఉంటుంది . కళాత్మక వస్తువులను సేకరించి ఇంటినిండా అలంకరిస్తారు . కళల పట్ల ఆసక్తి ఉంటుంది గుర్రపు స్వారి , కారు వంటి వాహనాలలో తిరగడం ఇష్టం . ఈత మీద ఆసక్తి ఉంటుంది . ప్రయాణం వీరి మనస్సును మారుస్తుంది .
మానసిక అశాంతి , కోపం , ద్వేషం , దుఖం , వంటి అనుబూతులు ప్రకృత దృశ్యాలను చూస్తున్నప్పుడు , ఊరు తిరిగి రావడం ద్వారా తగ్గిపోతాయి . చురుగ్గాను , ఉత్సాహంగాను కన్పిస్తారు .
చిరు ప్రాయంలో ఆటలమీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది యౌవనంలో సుఖ బాగాలను అనుభవించడంలో , ప్రగతి సాదించడంలో ఆసక్తి చూపుతారు . 40 ఏళ్లకు పిదప, ఆద్యాత్మిక , తత్వ ,అతీత శక్తుల గురించి పరిశీలించడం ,సామాజిక సేవా రంగాలలో ఆసక్తి , అభినివేశం కలిగి ఉంటారు . సంసార జీవితం విడచి వెళ్ళడానికి ఇష్ట పడతారు .
శ్రమ లేకుండా విజయం సాదించ వచ్చునని పనులకు పూనుకుంటారు . దానధర్మాలు ఎక్కువగా చేస్తారు . రాజకీయం , సినిమా , ఆటలు మొదలైన రంగాలలో రాణిస్తారు
వీరిమాటలలో చక్కటి అభిప్రాయాలు వెలువడుతుంటాయి . ఇతరుల బలం , సంపద అంతస్తులను గురించి లక్ష్యం చేయక తమ మనస్సులోని అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలుపుతారు . ఇతరులను పగ సాదించే ఆలోచన , వంచన , వంటి దుష్ట లక్షణాలు వీరిలో మచ్చుకైనా కనిపించవు . నీతి నిజాయితిలను ప్రాణం కంటే మిన్నగా భావిస్తారు . దాపరికం లేకుండా మాట్లాడతారు . ఆదాయం పెరిగే కొద్ది కర్చును కుడా పెంచుకుంటారు . ఆద్యాత్మిక ప్రగతిని సాదించిన పెద్దల యద ఎక్కువ గౌరవాభి మానాలు ఉంటాయి . తమ బందు మిత్రుల మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు . చేసిన మేలుని మరువని వారు . తల్లిదండ్రుల మీద , దేశం మీద , అపరిమిత భక్తీ భావాలు ఉంటాయి .
వీరి ప్రవర్తన వేష ధారణలో ప్రత్యేకత ఉంటుంది . సుగంద ద్రవ్యాలను వాడతారు . సుగంద ద్రవ్యాలమీద , పువ్వుల మీద ఆసక్తి ఉంటుంది .
రాజకీయ వేత్తలు శాసన నిపుణులు రాజ్య తంత్రజ్ఞులు , శాస్త్ర పరిసోదకులు , సాస్త్రకర్తలు , న్యాయ వాదులు ,ప్రసిద్ది గాంచిన వైద్యులు , ఆద్యాత్మిక గురువులు , ప్రక్యాతి గాంచిన రచయితలూ , కవులు , గాయకులూ , నటులు , దర్శకులు , ఎడిటర్లు , నటీమణులు , ప్రక్యాత క్రీడాకారులు , ఎగుమతి వ్యాపారం చేసే వారు . పారిశ్రామిక వేత్తలు , ఈ అంకెకు సంబందించిన వారు చాలా మంది ఉన్నారు .
జీవితానికి అవసరమైన కళాఖండాలను తయారు చేయడం , వ్యాయామ తత్వ పరిశోదన మొదలైన వృత్తులను చేపట్ట వచును . వైద్యం , జ్యోతిష్యం , మంత్రం , మనస్తత్వ శాస్త్రాలలో ప్రవేశం ఉంటుంది .
సంగీతం, నాట్యం, సాహసోపేత కార్య క్రమాలలో అబ్యాసం కలిగి ఉంటారు . కళాత్మక జ్ఞానం వీరికి సహజంగా ఉంటుంది . తెలివిని ఉపయోగించి సంపాదించే ప్రతిభ కల వారు . పత్రికా రంగములో గొప్ప రచయితలుగా రాణిస్తారు . మనస్తత్వ శాస్త్ర సంబందమైన పరిశోదన చేస్తారు .
మేకలు, పశువులు , కోళ్ళు , కుక్కలు , గుర్రాల వంటి పశు జాతి సంబందమైన వ్రుత్తి వర్తకం , కార్లు , బసులు , లారీలు , ఓడలు వంటి వాహన సంబందమైన వృత్తులలోను రాణిస్తారు . వృత్తిలో ఎక్కువ సంపాదించడం కంటే మంచి పేరు సంపాదించాడంలోనే దృష్టి కలిగి ఉంటారు . భావన నిర్మాణం , సామాజిక, రాజకీయ, సంస్కరణ వంటి వాటిలో ప్రకాసిస్తారు .
ఎకార్యంలో నైనా ఉన్నత ఆశయం తో ప్రవర్తిస్తారు . సాయం అని కోరి వచ్చిన వారికి తప్పక సాయం చేస్తారు . అప్పుడప్పుడు బయటికి వెళ్లి తిరిగి రావడంలో ఆసక్తి కనపరుస్తారు . దైవ ప్రార్ధనలో కొత్త మార్గం అవలంబిస్తారు .
ఇంజనీరింగ్, క్రీడా రంగాలలో విలక్షనత్వ్వాన్ని ప్రదర్శిస్తారు . వీరి మనస్సు విరామం లేకుండా ఎల్లప్పుడూ దేనినో ఒకదానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది . వాగ్వివాదాల అన్నిటిలో వేరు వ్యతిరేకంగా వాదిస్తుంటారు . నిజమైన ప్రేమకు అర్హులు .
అపరిచితులైనా వీరి వద్ద ప్రేమ కనపరిస్తే పరవశించి వారికి అన్ని రకాల సయం చేస్తారు .
ఆలోచనలోను, ఆచరణ లోను నూతనత్వం కనపరుస్తారు . దృడ చిత్తం కల వీరు ఇతరులు లోపం ఎత్తి చూపడాన్ని సహించరు . కొన్ని సందర్బాలలో కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు సిద్ద పడతారు . కాని అది పలించదు .
వీరి ప్రయత్నం తప్పక విజయం కలిగిస్తుంది . తమ ప్రయత్నం లో ఇతరులు జొర బడడాన్ని ఎస్తితిలోను అంగికరించరు . అలా ప్రవేశిస్తే కోపంతో తమ పదకాన్ని మార్చు కుంటారు .
నీతి తప్పని వారు . ఎ పనికి పూనుకున్నా అనేక పర్యాయాలు ఆలోచిస్తారు . వీరి కుటుంబ వ్యవహారాలను బయటి వారికి తెలియ జేయరు . తప్పుడు మార్గంలోనూ పద్దతిని విస్మరించరు . మనస్తైర్యం గురించిన తలపు ఎల్లప్పుడూ ఉంటుంది .
దైవ భక్తిని బలంగా ఆచరించి జీవితౌన్నత్యం పొంద వచ్చును . ఎంత సంపద వచ్చి నా వీరికి మనసు శాంతి ఉండదు .
తమ మనోబలం తో ఎంతటి శత్రువునైనా పడగోట్టగలరు. శాంతి ప్రియులు . గొడవలను హింసాయుత చర్యలను కుటుంబ కలహాలను ముందు నిలిచి మాట్లాడి పరిష్కరిస్తారు . గుడ్డిగా అదృష్టాన్ని విస్వసించరు .
వీరు 1,2,4,8 మొదలైన అంకెకు చెందిన వ్యక్తులను మాత్రమె స్నేహితులుగా కలిగి ఉంటారు . వీరు పై అంకెల వ్యక్తులకు మానసిక సాయం చేస్తారు . దేశంలోని అరాచ కత్వ్వానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాదిస్తారు .
4 వ అంకెకు అధిపతి రాహువు . విష శక్తులను పోగొట్ట గల వాడు రాహువు . మంత్రం, వశీకరణ , గుడాచార్య, న్యాయ విచారణ శక్తులు సులభంగా అలవడతాయి .
జీవితంలో ప్రగతి సాదించటానికి ప్రయత్నిస్తారు . ప్రారంబములో ఓటమి చెందినా విరామం ఎరుగని కృషితో విజయం సాదిస్తారు . కొందరిని మాత్రం స్నేహితులుగా చేసు కుంటారు . .
సాదారణంగా తప్పు చేయరు . అలా పొరపాటు జరిగినా తప్పనిసరి పరిస్తితిలో జరిగిన తప్పుగా ఉంటుంది . తాము చేసిన తప్పులను ఒంటరిగా చాలా బాధపడతారు . ఇతరులు చేసే తప్పులను తీవ్రంగా మందలిస్తారు .
ఎ పని నైనా బాధ్యతతో నిర్వహిస్తారు . తమకు అప్పగించిన పనులను జాగ్రత్తగా నిర్వహిస్తారు .
దుఃఖం లో ఉన్నవారికి తాము తోడ్పడతారు . పెద్దల మాటకు లోబడి అణుకువగా ఉంటారు .
వీరికి డబ్బు ను గౌరవించటం తెలియదు . ఆత్మగౌరవం కలవారు . వీరి మాటలను ఇతరులను నవ్వించడం కంటే ఆలోచింప చేస్తుంది .
సామాజిక కార్యక్రమాలలో ఆసక్తితో పాల్గొంటారు . వీరిని ఇతరులు త్వరగా అర్ధం చేసుకోలేరు . జనాకర్షణ , ప్రజాశక్తి గలవారు . ఎక్కువగా అనుబూతి వసులౌతారు . ఆత్మాభిమానం కల వారు మనస్సు ఎక్కువగా బాధకు లోనవుతుంది .
సమాజాన్ని ప్రభావితం చేసే శాసనాలను , పధకాలను , రూపొందించా గలరు . తప్పు చేసిన వారు ఎవరైనా గతిగా అడుగుతారు . ప్రాణం ప్రాణ స్వభావం గురించి పరిసోదిస్తారు .
చతుష్టష్టి కలలలోని ముఖ్యాంశాలు ప్రాదమిక విషయాలను గ్రహిస్తారు . మనస్సులోని కల్పనలు , కలలు కొన్ని సందర్బాలలో వాస్తవం అవుతుంది . వీరి మాటలు , హితబోధ పిరికి వాణ్ని వీరుడిగా చేస్తుంది .వయస్సు మీరిన వ్యక్తులపై , పిల్లల మీద ఎక్కువ పరమ కలిగి ఉంటారు .
[ వీరి గుణాలను పరిశీలించి చుస్తే వీరికి తమ గురించి చక్కగా బోడపడుతుంది ]
చరిత్రను సృష్టించగలరు . వీరి మరణాంతరం సైతం వీరిని గురించి ప్రజలు గొప్పగా మాట్లాడే స్తాయికి కీర్తి ఉంటుంది