3 వ సంక్యవారి పలితాలు
అంకె 3 -గురువు
విద్య వివేక ప్రదాత
ప్రతినెల 3,12,21,30 మొదలైన తారికుల్లో మరియు తేది,నెల ,సంవత్సరము మొట్టమ కలిపితే ఏక సంక్య 3 వచ్చిన వారు గురువు ఆదిక్యత లో జన్మించిన వారవుతారు .
లక్షణాలు – స్వభావాలు
ప్రపంచ జీవిత చలన చిత్ర నిర్మాత పర బ్రహ్మ సృష్టిలో 1 సంక్య 2 స్తితి 3 లయ అన్న మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి . భూత , భవిష్యత్ , వర్తమానాలని కాలని మూడు . 1 మామిడి ,2 పనస , 3 అరటి పండ్లలో ప్రత్యేకించి పేర్కొన బడ్డాయి . బ్రహ్మ ,విష్ణు , మహేశ్వరులు త్రిమూర్తులు , ముల్లోకాలు , ముక్కోటి దేవతలు ,కవిత్రయం అని మూడు అయిన గురు సంకేత సంక్య విశిష్టంగా అలరారుతుంది
కోణాలు మూడు . మూడు కోణాలు మూడు సంక్య సూచిస్తున్నది . క్రియ రూపమైన శక్తీ ప్రసాదిని అయిన అవి మానవాళి మనుగడకు అత్యంత ఆవశ్యకత . అవి 1 సత్యం 2 కృషి 3 ఉన్నతి .
వీరు ఆత్మా విశ్వాసం కల వారు . కృషి లో గొప్పవారు అవుతారు . గొప్ప నాయకులుగా కీర్తింప బడతారు . రాజకీయంగా ఎదుగుతారు . ఇతరులకు ఉపయోగ పడే గొప్ప సంస్కారం ఉన్నవాళ్ళు .[ ఈఅంకె కు చెందిన వారిలో చరిత్ర ప్రసిద్దికెక్కిన మహా నాయకులున్నారు ]
దైవ భక్తీ , దేశ భక్తీ గల వారు . గొప్ప క్రుషివలులు . ప్రేమ , సహనం , భక్తి , నిజాయితి వంటి గుణాలు వీరికి సహజంగా ఉంటాయి . పెద్దల మాటను గౌరవిస్తారు . విశ్వాస పాత్రులు . వీరు వెళ్ళిన చోట్లలో క్యాతి పొందుతారు . సత్య సందతలో చమ్రి మృగం వంటి వారు .
పెద్దలను గౌరవిస్తారు . చిన్నలను అభిమానం తో చూస్తారు . సలహాలను ఇవ్వడంలో గొప్ప ప్రతిభా వంతులు . వెనుకంజ వేయని కృషి చేయగలరు . బుజ్జగిస్తూ , ఆజ్ఞ లనిస్తూ పని తీయడం లో సిద్ద హస్తులు . పుష్పం వంటి సౌమ్య హృదయులు . దుహఖం లో పడే వారికి ఆదుకునే సహ్రుదయాలు . నీతి నిజాయితిలతోనే ఎ పని నైనా చేస్తారు .
దైవభక్తి కలవారు . మతాభిమానం కల వారు . ఆద్యాత్మిక జీవితాన్ని కోరి వరిస్తారు . పరమత సహనం కలిగి ఉంటారు . ప్రాచిన సిద్దంతాలు , ఆచార వ్యవహారాలను గౌరవిస్తారు . కొత్త నాగరిక మార్పులను వెంటనే స్వీకరిస్తారు
పెద్దలను , గురువులను అనుసరిస్తారు . స్వబుద్దితో ఎపనినైన చేస్తారు . అన్నిటిని న్యాయ మార్గంలోనే సాదిస్తారు . సయం అడిగి తన్ను చేరిన వారికి తప్పక సాయం చేస్తారు . కాని వీరు ఎవరిని సాయం అడగరు . ఆశ్రయించారు .
తమ సుఖాలను ఇతరులకు తెలియనివ్వరు . రహస్యాన్ని రక్షిస్తారు . ఆత్మా గౌరవం కల వారు . బుడ్డి సూక్ష్మత కల వారు . శాస్త్ర జ్ఞానం ఉన్నవారు . తమ సొంత పనుల కంటే సమాజ హిత కార్యాలకై ఎక్కువ శ్రమిస్తారు . సామాజిక జీవితంలోను కీర్తి ని గడిస్తారు .
పట్టు వదలని కార్య దీక్షా పరులు . కళలలో అభినివేశం ఉన్నవారు . శ్రమ వాళ్ళ , కృషి వల్ల , సుగుణాల వలన ఉన్నత పదవులు వీరిని వెదుక్కుంటూ వస్తాయి .వీరి మాటకు ,ప్రవర్తనకు ,ప్రజలలో మంచి గౌరవం ఉంటుంది . నిచ్చెన లా క్రమంగా జీవితం లో ప్రగతిని సాదిస్తారు .
దురాస లేని వారు . ఇతరుల అదికారానికై ఆసించరు . తమకు చెడు చేసే వారిని క్షమించే మానసిక పక్వత ఉన్నవారు . సత్యం కోసం శ్రమిస్తారు . సృజన సీలురు . [ వీరిలో గురువు ఆదిక్యత ఎక్కువగా ఉన్నవారు ఆత్మ విశ్వాసం కల వారుగా , తక్కువగా ఉన్నవారు ఆత్మ విశ్వాసం తగ్గినా వారుగా ఉంటారు ] ఇలా రెండు రకాల వ్యక్తుల్లుంటారు
తమ మనస్సులోని అభిప్రాయాలను చక్కగా భాహిర్గతం చేస్తారు . ఆత్మ గౌరవాన్ని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు . వ్యక్తిత్వ ప్రతిభ కలవారు . ఆజ్ఞలను శిరసా వహించి విజయం సాదిస్తారు .సమరమ్ లో ఓటమి చెంది జీవించడం కంటే , మరణించడం ఉత్తమమని సిద్దాంతం ఉన్నవారు . ఉన్నత ఆశయాలు కలవారు . ఏకాగ్రతతో వీరి లక్ష్య సాధనకు ఎంతటి సహసాన్నైన ప్రదర్శిస్తారు . మనుష్యులలో ఉత్తములుగా , గొప్ప నాయకులుగా, కీర్హి పొందుతారు . త్యాగ బుద్ది కల వారు . బుద్ది సుక్ష్మత , వివేకం వీరికి సహజంగా ఉంటాయి .చిరు ప్రాయం నుంచి తెలివైన వారుగా కీర్తింప బడతారు .విద్యలొ ప్రదమ స్తానం పొంది ఉంటారు . అనేకుల అభినందనలను పొంది ఉంటారు . ఇతరులు అభినందించే విధంగా వీరి ప్రవర్తన చిరు ప్రాయం నుంచి విశిష్టంగా ఉంటుంది .
వీరిలో కొందరు చిన్న వయస్సు నుంచి కుటుంబ బారాన్ని మోయవలసిన వారి ఉంటారు తమకు గొప్ప భవిష్యత్తు ఉంటుందన్న విశ్వాసం తో కర్తవ్య నిర్వహణ గావించి విజయం సాదిస్తారు .
ధర్మ వర్తనులై ఉంటారు . సంగ సేవా సమస్తలను నిర్వహిస్తారు . చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడరు . ఇతరుల మనస్సును నొప్పించరు .వీరి వేష బాషలలో , ప్రవర్తనలో , ప్రత్యెక ఆకర్షణ ఉంటుంది . శరీరంలో గాంబిర్యము పటుత్వము చోటు చేసుకుంటాయి .
మానసిక శక్తులు శరీరం అంతటా ఆవహించి ఉంటాయి . విద్యుశ్చక్తి వీరి శరీరం లో క్రియా శీలక శక్తీ గా పరిణమిస్తుంది . గంబిరమైన నడక , ఆకర్షనీయ దృష్టి , కంటి వంతమైన కళ్ళు ,వీరి సొంతం . సంబాషణ లో చతురులు . వీరి సంబాషణ లో ఆకర్షణ ఉంటుంది . స్పష్టమైన కాంతం ఉంటుంది .
పదాలను స్పష్టంగా , గంబీరంగా పలుకుతారు . వీరి మాటలు వినడానికి ఇతరులు ఆసక్తి చూపుతారు . రచనలోను , వాక్కులోనూ అర్ధ గాంబిర్యం ఉంటుంది . రాజకీయ రంగములో చాణుక్యులుగా ప్రకాసిస్తారు . శాస్త్ర జ్ఞానం కలిగిన వారు . చట్టాలు ఎరిగిన వారు .
డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది . తమకు , ఇతరులకు బేదం లేకుండా అందరికి కర్చు పెడతారు . ఎన్నడు ఆర్దిక పరమైన ఇబ్బంది ఉండదు . వీరు అనేక వృత్తులను నిర్వహించి డబ్బు సంపాదిస్తారు . వీరి వద్ద డబ్బు వస్తూ పోతూ ఉంటుంది .తమది, ఇతరులది అయిన డబ్బు ఎల్లప్పుడూ ఈరి వద్ద ఉంటుంది . ఇవ్వడం తీసుకోవడం ఎక్కువగా ఉంటుంది . ఆర్ధిక సమస్తల అభివృద్దికి చక్కగా కృషి చేస్తారు .
వీరు గొప్ప పారిశ్రామిక వేత్తలుగా ధర్మ స్తాపనా పరులుగాను , న్యాయ వాదులుగా , న్యాయాదికారులుగా , రాణిస్తారు . రాజకీయం , సినిమా ,ఆతల వంటి రంగాలలో ప్రవేశం గొప్ప కీర్తి పొందుతారు . మంచి మంత్రులుగా ధర్మ నిర్వాహకులుగా , గొప్ప వర్తకులుగానూ రాణించా గలరు .
పలు పర్యాయాలు బయట ఊల్లకు , విదేశాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు . వన ప్రాంతాలను దర్శించి పరవసిస్తారు . చారిత్రిక ప్రసిద్ది గాంచిన ప్రదేశాలను చూస్తారు . వీరి మాటలలో , ప్రవర్తనలో జ్ఞానం ప్రకాశిస్తుంది . ఎ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పదం తో పరిస్సేలిస్తారు .
కుటుంబం మీద ప్రేమ , త్యాగ బుద్ది కలవారు . కీర్తికి కానీ , పదవులకు కాని కాంక్షించి శ్రమిస్తారు . నిత్య చలన వంతమైన ప్రపంచ జీవితానికి మిక్కిలి ఆవశ్యకమైన వృత్తిని చేపడతారు . ఇతరులకు సాయపడడం లో ప్రత్యెక ఆసక్తి కలిగి ఉంటారు . తమ కుటుంబానికి , మిత్రులకు , తమను నమ్మిన వారికి అన్ని విదాలుగా తోడ్పడతారు .మంచి మిత్రులను కలిగి ఉంటారు .
ప్రసిద్ది గాంచిన వైద్యులుగా , సిద్ద వైద్య నిపుణులుగా , కొత్త పరిసోదనలు చేసే సాస్త్రజ్ఞులుగా ఉంటారు . మతగురువులుగా , సన్మార్గ బోధకులుగా ఉంటారు . ఆద్యాత్మిక దృక్పదం కలిగి ఉంటారు .
వీరి ప్రతి చర్యలోనూ ప్రత్యేకత గోచరిస్తుంది . ఎ పనినైనా చక్కగా నిర్వహించ గల నేర్పరులు . పలువురు వీరి కడ సలహాలకై వస్తుంటారు . విశాల దృక్పదంతో ఆలోచించి త్వరగా ఆచరణ శీలురు అవుతారు . తల్లిని గౌరవించినట్టే మాతృ దేశాన్ని గౌరవిస్తారు . సాయపడడంలో ఉన్నత మనస్కులు .
ఇతరుల మనస్తత్వాన్ని గ్రహించ గలవారు . మనస్సును ఆకర్షించే శక్తీ కలవారు , శాస్త్ర పరిశోధనలో ప్రసిద్ది గాంచిన వారుగా ఉంటారు . కార్య సాధకులు . ప్రపంచ చరిత్రలో చోటు చేసుకోగలరు . కార్య నిర్వహణ లో పట్టుదల కల వారు . కారుకు దానం ఉంటుంది . కానీ సౌమ్యులు .
కాలానుగుణంగా కన్పించే వ్యవహారాలను విప్లవాత్మకంగా ఆచరించ గలరు . సమాజ హితం ఆశించడంలో ఉన్నతులు . తప్పుచేసిన వారిని క్షమించే మనస్తత్వం కల వారు . దేశ శాసనాలను జీవిత ధర్మాలను బాగా తెలిసిన వారు . ద్యానం , యోగం ,కుండలిని శక్తీ వంటి విషయాలలో పరిజ్ఞానం ఉంటుంది .
పగలు రాత్రి అన్న భేదం లేకుండా శ్రమించ గలరు . ఇతరుల ఆస్తి కోసం ఎ నాడు ఆశించరు . విప్లవాత్మకమైన ఆలోచనలు , విశిష్టమైన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు . గురువు యొక్క అనుగ్రహం , దైవానుగ్రహం , పొందిన వారు . గురువు ఆదిక్యత సంపూర్ణంగా ఉన్నందున , ఇతరులకు బోదించడం లో శ్రేష్టమైన గురువులుగా రాణిస్తారు . వీరి జీవితం ఫలవంతమౌతుంది .
దేశపు ముక్యమైన భాద్యతలను నిర్వహించే వ్యక్తులుగా . మానవ సమాజాన్ని సంస్కరించే రచయితలుగా ప్రకాసిస్తారు . గెలుపు ఓటములకు చలించరు . ఆద్యాత్మిక మార్గం , ఆద్యాత్మిక ఆలోచనలతో ఆనందం పొందే వీరికి యోవ్వనంలో బట్ట తల వచ్చే అవకాశాలు ఉన్నాయి . సామాన్యంగా ఎవరి వద్ద మోసపోరు .ఎవరిని వంచించడానికి ఇష్టపడరు .
తమ మాటకు బద్దులయే మిత్రులు ఉంటారు . ప్రజలను చైతన్య పరచే , ఆలోచింప చేసే ప్రజానాయకులుగా ఉంటారు . సాహిత్యంలో , శాస్త్ర పరిశోధన లో ఆసక్తి కలిగి ఉంటారు .
సినిమా నిర్మాణం , కద, మాటలు చిత్రానువాదం , శబ్ద గ్రహణం , దర్సకత్వం , మొదలైన శాఖలలో కీర్తి గడిస్తారు . నటనా రంగములో ప్రసిద్ది పొందుతారు . వీరి అభిప్రాయాలను సిద్దాంతాలు అనుసరించే ప్రజలు చాలా మంది ఉంటారు .
జీవితం లో శ్రమించి ప్రగతి సాదిస్తారు . బంగారు , నవ రత్నాల అమ్మకం వంటి వృత్తులను చేపడతారు ఇల్లు , నెల, వాహనం మంచి భార్య , సత్సంతానం ,పొంది ఉన్నత జీవనం కలిగి ఉంటారు .
ఇళ్ళను కళాత్మకము గా తీర్చి దిద్దుతారు .యంత్ర పరికరాలు , రాసాయినాలు , కళలకు సంబందిత పరిశ్రమల వలన ప్రగతి సాదిస్తారు . కళాబి నివేశం ఉన్న వీరు కళలను , సంస్కృతిని పరిరక్షించడంలో ఆసక్తి కల వారు . కమిషన్ వ్యాపారము, ఏజన్సీలు , వంటి వృత్తుల ద్వారా ధనం గడిస్తారు . దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు .
వీరు ఎంత సంపన్నులైనా ఆడంబర జీవితాన్ని ఆసించరు. గొప్ప సమాజ సేవకులుగా ఉంటారు . సమాజ రహిత కార్యాలలో మనస్పూర్తిగా పాల్గొంటారు . గోరవ ప్రదంగా జీవిస్తారు . అంతరిక్ష పరిశోధనలో ఆసక్తి ఉంటుంది మంచి వైద్య నిపుణులుగా , పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తారు . పలువురి అభినందనలు లభిస్తాయి .
వీరి శరీరంలో ఆకర్షణ ఉంటుంది . ప్రభుత్వ ఉద్యోగాలలో త్వరగా ప్రగతి సాదిస్తారు . ధర్మ సమస్తలకు నాయకత్వం వహిస్తారు . రక్షణ శాఖలో పంచి నిర్వాహకులుగా ప్రసిద్ది పొందుతారు . మిలటరీ గొప్ప హోదాలను వహిస్తారు .
సుక్ష్మ వివేకం కలిగి ఉన్నందున శాస్త్ర పరిశోధన , బౌతిక శాస్త్ర పరిశోధన , విద్యుశ్చక్తి , కంప్యుటర్ రంగాలలో ప్రగతి సాదించగలరు , ఇతరులకు సలహాలనిచ్చి సంపాదించ గల యోగం ఉన్న వారు .
విదేశాలకు వెళ్లి గడించ గల వారు . విదేశాలలో సంబంధం కలిగి ఎగుమతి , దిగుమతి వ్యాపారాలు చేస్తారు . మంచి విదేశా మిత్రులు కార్యాలకు తోడ్పడతారు .
ఏనుగు వంటి గామ్బిర్యము కల వారు . చురుకైన చూపులు కల వారు . . ప్రసన్న గంబీర వదనులు . సంబాషనా చాతుర్యం తో ఇతరుల మనస్సును ఆకర్షించ గలవారు . వీరి చూపులో , మాటలో ఒక విదమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది . పిల్లల పై ఎక్కువ ప్రేమ కలవారు .
విధిని జయించే బుడ్డి బలం ఉన్నవారు . పని చేసే చోట్లలో నమ్మకంగా , వినయం తో విధి నిర్వహణ చేస్తారు . ఈత కొట్టడంలో ఆసక్తి కలిగిన వీరిలో కొందరు మంచి దిట్టలుగా కీర్తి గడిస్తారు . ఇతరులకు తల వంచి జీవించడం కంటే తమకంటూ వృత్తిని ఏర్పరచు కోవడాన్ని ఇష్ట పడతారు . ప్రతిభను గుర్తించి అభినందిస్తారు .
డబ్బు కోసం కీర్తి కోసం తపించారు . మంచి పనులు చేయడం , మంచి అలవాట్లను కలిగి ఉంటారు .బ్యంకు , న్యాయస్తానాలలో ఈ ఆదిక్యత కలిగిన వారు ఎక్కువగా కన్పిస్తారు . శరీర పటుత్వం ఉంటుంది . నిజాయితీగా జీవిస్తారు .
ప్రపంచం బాగుండాలన్నది వీరి అభిప్రాయం . పరిశ్రమ రంగములో , ఉద్యోగం లో ఔన్నత్యం కలిగి ఉంటారు . కర్తవ్య నిర్వహణలో ఆత్మకు బిన్నంగా వ్యవహరించరు. ఆపదలను ముందు గానే గ్రహించి జాగ్రత్త పడతారు . స్తిరస్తులు ఉంటాయి .
గణిత శాస్త్రం లో ప్రతిభ వాక్చాతుర్యం ఉంటుంది . ఇతరులు చెప్పిన దానిని పూర్తి గా విశ్వసించక తమ మనస్సుకు నచ్చిన విషయాన్ని మాత్రమే ఆచరిస్తారు . ఇతరులను పొగడి పనులను చేసుకోవడాన్ని ద్వేషిస్తారు . వీరితో ఎవరు గొడవ పడరు . వారి తోబాటు ఎల్లప్పుడూ కొందరు ఉంటూ ఉంటారు .
నిందించరు . తమకు ఎవరైనా నచ్చ నట్లయితే వెంటనే దూరంగా తొలగి పోతారు . డబ్బు విషయంలో నిజాయితీ కలిగి ఉంటారు . వాహనం నడపడం , ఈత , ఆటలు , తుపాకి పేల్చడం మొదలగు వాటిలో ఆసక్తి ఉంటుంది . ఫలితం లేని పనులు చేయరు .
ఆకర్షణ ముఖం ,చక్కటి రూపం లో ఉంటారు . ప్రపంచం లో జరిగే సంగాతనలను అన్నింటిని తెలుసుకుంటారు . పొదుపుగా ఉంటారు సహన వంతులైన వారు . కనుక ఎపనినైనా ధైర్యంగా చేపట్టి విజయం సాదిస్తారు . గౌరవనీయులు .
విదేశాలకి వెళ్లి సంపాదిస్తారు . సంపద గడించడమే కాక క్రమ శిక్షణ తో వ్యవహరిస్తారు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెలి బుచ్చ గలరు . ఏసమస్యనైనా మాటల ద్వారా పరిష్కరించ గలరు .
తమ అర్హతకు లోపమైన ఎపనిని చేయరు . నీతి , నిజాయితీ మొదలైన ఉన్నత గుణాలు చిరు ప్రాయం నుంచే అలవర్చు కుంటారు దైవ ప్రార్ధనను ప్రత్యేకంగా చేస్తారు . మానవాతీత శక్తుల పై మక్కువ కలిగి ఉంటారు .
సంపద , శక్తీ , విద్యలకు అడిదేవతలైన లక్ష్మి , పార్వతి , సరస్వతులను ఆరాదిస్తారు . మూడు అంకెకు ప్రతీకగా వారి చర్యలుంటాయి . సత్పలితాలను అనుగ్రహించే శాస్త్ర పద్దతులను పాటించి జీవితం గడుపుతారు .
పాటశాల, కళాశాల, విశ్వవిద్యాలయ అధికారులుగా , అధ్యాపకులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి . న్యాయాదికారులు , న్యాయవాదులు , విదేశాలలో దూతలు , మంత్రులు , పొలిసు శాఖలో ఉన్నతాదికారులు , తత్వవేత్తలు ,వైద్యులు ,వర్తకులు , నటులు వంటి వారు ఈ అడిక్యతలో జన్మించి ఉన్నారు .
కుటుంబములోని సోదర సోదరి మణులు మొదలైన అందరితో ప్రేమగా ప్రవర్తిస్తారు . ఆర్దికోన్నతి గురించి మంచి అవగాహన కలిగి ఉంటారు . ఉన్నత లక్ష్యం తో ప్రవర్తిస్తే వీరి జీవితంలో ఓటమి ఉండదు . ఓటమి కలిగినా దైవ భలం తో విజయంగా మలచు కుంటారు .
మాటకు బిన్నంగా ప్రవర్తించరు . మంచి హృదయం , మంచి ప్రవర్తన ,కలవారు . సంపన్నులు , కొందరు మరి ధనవంతులై ఉంటారు . యవ్వనం లో శ్రమించి సంపదను చేకూర్చు కుంటారు . ఉన్నతిగా జీవిస్తారు