అంకె 2 – చంద్రుడు
జ్ఞాన – ప్రదాత
ప్రతి నెల 2,11,20,29 తేదిలలో జన్మించిన వారు మరియు తేది,నెల సవత్సరము కలపగా వచ్చిన ఏక సంక్య 2 వచినా చంద్రాదిక్యత జన్మించినవారు
వీరి లక్షణాలు స్వభావాలు –
భూమి , ఆకాశము,నీరు,నిప్పు , గాలి ,శివ ,శక్తులు,సూర్య చంద్రులు ,గెలుపు ఓటములు , సుఖ దుక్కాలు, స్త్రీ పురుషులు ఇలా పలు ప్రకృతిలో మనవ జీవితంలో జంటగానే కానీ పిస్తాయి .
శరీర కారకుడు , మనః కారకుడుగా ఉన్న వాడు చంద్రుడు . ఈ అంకె అడిపత్యముగా కలిగిన వారు ప్రజల మద్య ప్రక్యాతి గాంచ గలరు . చక్కటి జ్ఞానం ఉన్నవారుగా విషయ పరి జ్ఞానం కలవారుగా కీర్తి గాంతురు .[మిక్కిలి ప్రక్యతి గాంచిన పెద్దలు ,మిక్కిలి దుర్మార్గ వర్తనులు ఈసంక్యలొని వారి ఉంటారు ]
మానసిక శక్తీ అపరిమితంగా కలిగి ఉంటారు . కల్పనా శక్తీ కొత్త పరిశోదన వంటి లక్షణాలు వీరిలో ఉంటాయి ంఅనసిక శక్తుల ద్వారా వీరు అద్బుత కార్యాలను సాదిస్తారు . కల్పనా కల్ప వృక్షాలు అవుతారు .బుద్ది బలం విస్తారమైన వీరికి మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయి . వాస్తవాల కంటే కల్పనలే వీరి మనస్సును ఆకర్షిస్తాయి .
జ్ఞాన సంబందమైన విషయాలలో ఆసక్తి ఉంటుంది . ద్యానం , యోగం , తపస్సు ,అహింసా తత్వము కలిగినవారు . మనస్సులో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి . సహజంగానే మానసిక శక్తీ తగ్గి ఉన్నట్టు ఉండి విస్తరిస్తుంది . మానసిక శక్తిని పెంచడానికి అలవాటు పడితే జీవితంలో పలు విశిష్ట లక్షణాలు చోటు చేసుకుంటాయి .
ఇతరులకు అసాధ్యమైన కార్యాలను వీరు పెద్దగా శ్రమించ కుండా చాలా తేలికగా చేయగలరు . అనేకుల అభినందనలు పొందుతారు . వీరికి మనవ శక్తి కంటే దివ్య శక్తీ అనేక విదాలుగా తోడ్పడుతుంది . మంచి ప్రవర్తన గల 2 వ అంకె గల వారు అదర్శ పురుషులుగా కీర్తింప బడతారు .
మానసిక శక్తి లోబడిన వీరు ఆద్యాత్మిక బలాన్ని సమకూర్చు కుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది . సాదారణంగా వీరిలో ఆత్మా విశ్వాసం తక్కువ ఉంటుంది . తనను కూడా విస్వసించరు . ఇతరులను సామాన్యంగా విస్వసించరు .
2 వ అంకె అధిపతి చంద్రుడు . అతడికి స్వయం ప్రకాస శక్తి లేదు . సూర్య కాంతిని గ్రహించి భూమికి కాంతిని ప్రసరింప చేస్తుంది . కనుక 2 అంకెకు చెందిన వారు ఆద్యాత్మిక, ద్యానము మొదలైన వాటిలో ఏదో ఒక విషయం లో నమ్మకం కలిగి ప్రవర్తిస్తే జ్ఞానం వృద్ది చెందుతుంది .ఉన్నత జీవితం సాధ్యమవుతుంది .
చిన్న కార్యాన్నైనా ఇతరులను విశ్వసించి వారికి అప్పగించరు . ఎ పని నైనా తామే చెయ్యాలనుకుంటారు . అప్పుడే వారికి తృప్తి కలుగుతుంది . కొన్ని సందర్బాలలో అనిశ్చిత , ఆత్మ విశ్వాసం తగ్గుదల కానిస్తాయి . జీవితం లో ఏమాత్రం సంబంధం లేని సమస్యలకు ఇబ్బంది పడవలసిన పరిస్తితులు ఏర్పడతాయి . అనవసరమైన సమస్యలు ఎక్కువ అవుతాయి .
మనస్సు అంధకారం లో ఉంటుంది . సందేహ ప్రవ్రుత్తి ఇబ్బంది పెడుతుంది . తొలుత భయముతో కూడిన చిరునవ్వు బయట పడుతుంది . సహజంగా భయ స్వభావులు . ఈ సంక్యకు చెందిన వారు కొందరు ఉన్నతాదర్సవంతులుగా , తత్వ వేత్తలుగా కీర్తి పొందుతారు . మనస్సును అదుపులో ఉంచుకుంటే వీరు అన్ని పనులలోను విజయం సాదించ వచ్చును .
చిన్న విషయాలు సైతం ఎక్కువ చేసి మాట్లాడతారు . అతిశయం చూపడం , అతిసయోక్తిగా మాట్లాడడం వీరికి అలవాటు . అగ్ని వంటి మాటలు దృడమైన వాగ్బలము కలిగి వుంటారు . తమ్ము వ్యతిరేకించిన వారి ముందు అణగి ఉంటారు . తనకు లోబడిన వారిని అణచి పాలిస్తారు . బ్రతి మాలితే అలక్ష్యం చేస్తారు . అలక్ష్యం చేస్తే బ్రతి మాలుతారు . మాటల్లో ధైర్యము కనపరచినా , మనస్సులో భయం వెన్నాడుతుంది .
వీరిలో నిజం మాట్లాడే ఉన్నత లక్షణాలు కల వారున్నారు . కేవలం అబద్దాలు మాట్లాడే అధములు కూడా ఉన్నారు . [ చంద్రునికి కృష్ణ పక్షము , శుక్ల పక్షము ఉంటాయి . అమావాస్యలో చీకటి పూర్నిమలో ప్రకాశం సహజం అదేవిదంగా ఈ అంకెకు చెందిన వారిలో మంచి వారు , చెడ్డవారు ఉండడం జరుగుతుంది ]
వీరి మనస్సు ఒకే స్తితిలో ఉండదు . సందర్భాను గుణంగా మారుతూ ఉంటుంది . తన్ను చేరిన మిత్రులు తనతో పని చేసేవారి ప్రవర్తన ,వేషధారణ ,ఆలోచనలు , ప్రభావాలు వీరి పై కుడా ప్రసరిస్తుంటాయి . ఈ సంక్యదిక్యతలో జన్మించిన పిల్లలను పెద్దలు మంచి అలవాట్లతో , దైవ భక్తీ సంస్కారం తో పెంచడం మంచిది .
ఇతరులకు హిత బోద చేయడంలో సిద్ద హస్తులు . తాముగా చేపట్టే కార్యక్రమం విషయంలో పలు పర్యాయాలు ఆలోచించి నిర్ణయానికి రాలేక తడబడతారు . తన్ను చూసి భయ పడే వారిపై విరుచుకు పడతారు . తనపై విరుచుకు పడే వారిని చూసి దాసోహం ఉంటారు . ఇరు రకాల మనస్తత్వం ఉన్న వారు కనుక దృడ చిత్తాన్ని పెంపొందించు కోవాలి .
వీరు ఒంటరిగా ఒక కార్యాన్ని ఆచరించటం కంటే తమకు అనుగుణమైన సంక్య గల వారితో కలసి పనిని ఆచరిస్తే విజయం సాదిస్తారు . వీరికి మానసిక క్రియ కంటే శారీరక క్రియ తక్కువ . ఒక పనిని ప్రారంబించ టానికి ముందు పలు పర్యాయాలు ఆలోచిస్తారు .
కొన్ని సందర్బాలలో సోమరి తనం కనిపిస్తుంది . వీరికి అన్నిరకాల ప్రథిభలున్నా శారీరక శ్రమ ఆసక్తి సూపరు . ఎ కార్యారంబానికైనా ముందుగా అనేకులను సంప్రదించి తుదకు ఆ పని విడచి పెడతారు . మాటల్లో హాస్యం కన్పిస్తుంది . తర్కించడంలో ప్రియం కలిగిన వారు . చిన్న విషయానికైనా అనిక కోణాలలో వివరణ ఇవ్వాడలో సిద్ద హస్తులు . కళల పట్ల ఆసక్తి కల వారు .
వీరు విజయం సాదించాలంటే మనో బలాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచు కోవాలి . మనస్సులో స్పష్టత లేమి , వ్యర్దంగా బయ పడటం మొదలైన లక్షణాలను విడనాడాలి .
వీరికి ప్రత్యక్షంగా స్నేహం పరోక్షంగా పగ వృద్ది చెందుతుంది . రాజకీయాలలో ప్రవేశం , సాటిలేని నాయకత్వ పీతం లబ్యామవుతుంది . చిన్న సమస్యనైనా బుతద్దంలో చూసినట్టు పెద్దగా ఉహించుకుంటారు . వ్యర్ధ భయాలను అరికట్టాలి . మనో సంకల్పం వీడేరుతుంది .
కల్పనల ద్వారా సంపద చేకూరుతుంది . కవులు , రచయితలూ , ప్రక్యాతి గాంచిన నటులు , ఛాయాచిత్ర కళాకారులు , దర్శకులు మొదలైన వారందరూ ఈ సంక్యలో జన్మించిన వారే .
ఓటమి దుః ఖానికి బయపడతారు . ఇవి ఎక్కువ అయినప్పుడు పిచ్చి వారుగా , ఆత్మా హత్య చేసుకోవాలన్న ఆలోచనలు కల వారుగా ప్రవర్తిస్తారు . గొంతు కోసుకొని , నీటిలో మునిగి ఆత్మా హత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు .
వీరి దుఃఖః నివారిణి దైవబలం . ఆత్మ విశ్వాసం తో ప్రవర్తిస్తే వీరికి సునాయాసంగా విజయం లభిస్తుంది . వీరి వ్రుత్తి విజయానికి నిజాయితీ , నీతి పెట్టుబడి అవుతుంది .
యౌవనంలో సామాన్యంగా ఉన్నా ఆ తరువాత రాజు లాంటి జీవితం సాధ్యమవుతుంది . `ఉన్నత ఆశయం తో జీవించే వారై అధికారం , సంపద , కీర్తి మొదలైన వి పుష్కలంగా లబిస్తాయి . దేవుని పై నమ్మకం , మనో బలం , రెండింటిని , సమర్దవంతంగా ఉపయోగిస్తే గొప్ప ధన వంతులు కావడం తద్యం .
ఇతరుల మనస్సు నెరిగి మాట్లాడడంలో నేర్పరులు . విభిన్న మైన పద్దతిలో వృత్తిని ఆచరించి డబ్బును సంపాదించ గలరు . చట్టం , వేదాలు , ఇతిహాసాలను పరి సోదించడం వైపు దృష్టి సారిస్తారు . లాయరు , ఉపన్యాసకులు , గాయకులూ వంటి మాటల ద్వారా సంపాదించే వృత్తులలో రాణిస్తారు .
కలలలో నిష్ణాతులుగా కీర్తి గడిస్తారు . తామున్న పార్థి కోసం , తమ వర్గం కోసం, తమ దేశం కోసం , తమ సంబాషణ , ఉపన్యాసాల ద్వారా వాదించి విజయం సాదిస్తారు . పరమ భావాలు కలిగి ఉంటారు . సినిమా , నాట్యం , కావ్యం , చిత్ర లేఖనం , సంగీతం వంటి అనేక ప్రక్రియలలో కీర్తి గడిస్తాడు .
ఏకాగ్రతతో ఆచరించే అన్ని వృత్తులలో తప్పనిసరిగా విజయం పొందుతారు . వీరి శరీరం లోని ఒక రకమైన ఆకర్షణ శక్తీ మానసికంగా , హక్కు ద్వారా సమగ్రంగా బహిర్గతమవుతుంది . కలలో కనిపించేవి వాస్తవంగా జరుగుతాయి . వీరు గొప్పవారుగా , కొత్త మాట సిద్దాంతాలను ప్రతి పాదిన్చేవారుగా , విప్లవాలను సృష్టించే వారుగా ఉంటారు .
ఆద్యాత్మిక దృక్పదం బలపడి ,శరీరంలో ఒక ఆత్మా వంటి మానవాతీత శక్తీ ఉన్నట్లు అప్పుడప్పుడు వీరికి అనిపిస్తుంది . ఈ శక్తీ కారణంగా వీరికి మేలు జరుగుతుంది
పరకలు చూపించే అత్యదిక అభిమానాన్ని , కీర్తిని వీరు ఇష్ట పడరు చాలా తేలిక గా గురువు అనుగ్రహం , దైవానుగ్రహాలను , జ్ఞాన సిద్ధిని పొంద గలరు .
చంద్రుడు నీటికి సంబందించిన ఉపగ్రహం . కనుక వీరికి నీటి స్వభావాలు గల వ్రుత్తి సుభాన్ని ఇస్తుంది . కాఫీ ,టీ ,వంటి వ్యాపారాలు ,పాలు ,ఐస్స్ , చల్లటి పానీయాలు , గ్యాసు , రసాయనాలు , ఆమ్లాలు , ఆసిడ్ , వంటి వ్యాపారాలు మంచి లాభాన్ని ఇస్తాయి .
కళల ద్వారా సంపాదన సాద్యం . నాగరిక వస్తువులను విక్రయించడం , వ్యవసాయం , నీటిలో తయారయే వస్తువులను ఉత్పత్తి చేయడం , వస్త్రం , ఆభరణం , ముక్యంగా స్త్రీలను ఆకర్షించే నగలు , సువాసన ద్రవ్యాలు , ముత్యాలు ,వజ్రాలు , పగడాలు వంటి రత్న సంబంద మైన వ్యాపారాలు లాభిస్తాయి .
స్త్రీలు ఇష్ట పడే వస్త్రాలు , బొట్టు , పూలు , సెంట్లు వంటివి విక్రయించడం , తాయారు చేయడం , మందుల షాపు , సొగసును చేకూరే తైల సంబంద వస్తువులను , ఔషదాలను తయారు చేయడం . సినిమా , స్టూడియో , ఫోటో స్టూడియో , కళల సంబందమైన ఉత్సవ నిర్వహణ , కల్పనా నైపుణ్య ప్రదర్శనకు అనువైన సినిమా రంగం , ఇవన్నీ వీరికి అనుకూలమైనవి .
కుండలిని యోగ సంబందమైన రహస్య మార్గాలను కను గొంటారు . మంత్ర పద్దతులతో సిద్ధిని పొందుతారు . మంత్ర సిద్ది , సిద్దుల శక్తి , మోహనం , ఉచ్చాటన ,విద్వేషణం , ఆకర్షణం , వంటి ప్రక్రియలు వీరికి సునాయాసంగా వసమవుతాయి. మార్గ యోగం గ్రహిస్తారు .
ఇతరుల మనస్సును , స్వభావాన్ని ఎరిగి మాట్లాడే ప్రతిభ కల వారు . అప్పుడప్పుడు మనసులో దుష్ట ఆలోచనలు మొదలవుతాయి . అటువంటి ఆలోచనలు వృద్ది కాకుండా ఆటంకా పరిస్తే గొప్ప జీవితం లబ్య మవుతుంది . వీరి మెదడులో , ఇంద్రియాలలో , రక్త ప్రవాహం లో చంద్ర శక్తీ భాహిర్గతమవుతుంది . ఆకర్షణ శక్తీ నెల కొని ఉంటుంది .
తీవ్ర తర ఆలోచనలు , రాక్షసమైన పనులు వీరి సహజ గుణాలు . విశ్రాంతి లేని శ్రమ వీరి శరీరంలో ఉంటుంది .. ఎకార్యం లో నైనా మిక్కిలి జాగ్రత్తగా వ్యవహిరిస్తారు . ఎవరితో మాట్లాడినా ఆచి తూచి మాట్లాడతారు . మిక్కిలిగా కల్పనా శక్తీ ఉంటుంది .
ఎవరిని తొందరగా విస్వసించరు . ఎవరినైనా విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని ఎ శక్తి తొలగించదు . ప్రాణాలతో కలసిన బందంగా భావిస్తారు . ఎక్కువ వీరు ఉహా లోకం లో విహారిస్తారు . పగటి కళలు కంటారు . కళలు నిజాము అవడానికి నిర్విరామంగా కృషి చేస్తారు .
దైవ నమ్మకం , గురు భక్తీ సహజంగా వీరికి అలవడిన మంచి గుణాలు . ఉహ శక్తి
సహజంగానే వీరికి ఎక్కువ . అనవసరమైన భయము , ఆందోళన వీరికి ఉంటాయి . కుటుంబ జీవితంలో చిన్న సమస్యలు ఉంటాయి . సంబంధం లేని కారణాల వల్ల కుటుంబములో అశాంతి యుత వాతావరణం నెల కొంటుంది . కుటుంబ కలహాలకు సాదారణంగా కారకులైన వారు ఈ అంకెకు చెందిన వారై ఉంటారు .
వీరు ఎల్లప్పుడూ తమ భవిష్యత్తు గురించి కాని , గతం గురించి కాని , ఆలోచిస్తూ ఉంటారు .పట్టుదల కల వారు .ధైర్య వంతుల్లా ప్రవర్తిస్తారు . కానీ సహజంగా వీరు పిరికి వారు . ఒంటరిగా ఉహలలో ఆకాశ యానం చేస్తారు . ప్రకృతి దృశ్యాలను చూసి పరవసిస్తారు .
చంద్రదిక్యత గల వీరి మనస్సు శరీరం అంతా పాకి పాలిస్తూ ఉంటుంది . చంద్రుడు సూర్యుని నుండి శక్తి పొంది ప్రసాదిస్తున్నట్లే , వీరుకూడా ఇతరుల ద్వారా ఉపయోగాలు గ్రహించి విజయం సాదిస్తారు .
వాక్సుద్ధి కలవారు . సంబాషణ ద్వారా ఇతరులను ఆకర్షిస్తారు . వీరి మాటలకు లోబడిన ప్రజలుంటారు వదనా పటిమ వుంటుంది . మాటల ద్వారా సంపాదన ఆర్జించే అవకాశం ఉంటుంది . గాయకులూ , ఉపన్యాసకులు , టీవి , రేడియో లలో ప్రసంగించేవారు , తమ పార్టి బలమైనదని వాదించే వారు , న్యాయవాదులు ఈ అంకెకు చెందినా వారుగా ఉంటారు
ఆడంబరాల మీద , తుచ్చ సుకాల మీద , కామ వ్యవహారాల మీద మనస్సు ఆకర్షింప బడుతుంది . అప్పుడు తమ మనస్సును అదుపులో ఉంచుకొని , మంచి మార్గం లో ఉంచితే ఉన్నతమైన శాశ్వతమైన కీర్తిని పొంద గలరు .
చంద్ర శక్తి కారణం కొందరికి పుత్రా ప్రాప్తి కి ఆటంకం కలిగి , తొలగి పోతుంది . కొందరికి అనేక పనులు చేసి పెడతారు . తమకు సమస్య కలిగినప్పుడు తడబడతారు . తమను కీర్తించే వారికి పూర్హిగా సాయపడతారు . మనోబలము మంత్రం శక్తి , మనస్సును ఆకట్టు కొని విస్తరిస్తాయి . పొగడ్తను ఇష్ట పడతారు .
అందం చెడని ముఖం తో , ఆకర్షనియంగా కనపడతారు . వీరి శరీరంలో నీటి గమనం ఎక్కువగా ఉంటుంది . నీటి సంబందమైన ఆహార పదార్దాలను ఇష్ట పడతారు . జ్యోతిష్యం , చిత్ర లేఖనం , చట్టం , సంగీత ప్రక్రియలలో ఆరితేరిన వారి ఉంటారు . వైద్య రంగములో ప్రక్యాతి గాంచి న వైద్య నిపుణులుగా ఉంటారు .
వయస్సు పెరిగిన కొద్ది జీవన స్తాయి పెరుగుతూ ఉంటుంది . యుక్త వయస్సు తరువాత ఇల్లు , పొలం , వాహనం వంటి ఆస్తులు సమకూరుతాయి . జీవితంలో త్వరగా అభివృద్ధి చెందాలన్న ఆశతో పరస్పర విరుద్దంగా ప్రవర్తిస్తుంటారు.
కొన్ని సమయాలలో విడివడి ఒంటరిగా ఉండాలన్న కోరిక కలుగుతుంది .యవ్వన భావాలకు లొంగుతారు. స్త్రీ పురుష ఇరువురు కామ వ్యవహారాలలో సుఖం పొందాలని ఆశిస్తారు . దాన్ని ఆచరిస్తారు . పరమ పవిత్రతకు గౌరవించే మనస్తత్వం కూడా ఉంటుంది .
వీరికి మంచి కుటుంబ జీవితం ఉన్నా , మద్య వయస్కులుగా ఉన్నప్పుడు , ఏకాంతంగా ఉండడానికి , ఒంటరిగా ఎక్కువ సమయం గడపటానికి ఇష్ట పడతారు . కొన్ని పనులలో స్నేహ విషయంలో సర్దు బాటు ధోరణిని అవలంబించాలి .
ఏదేని ఒక అలవాటుకు లోనై , వదలి పెట్టలేనందుకు చిన్తిస్తారు . కనుక చెడు అలవాట్ల జోలికి వెల్ల కుండ ఉండడం మంచది . ప్రపంచము లోని అనేక విషయాలను తెలుసు కొని ఉంటారు అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి . ఎల్లప్పుడూ శుబ్రంగా కన్పించతానికి ఇష్ట పడతారు .
ఉద్యోగ రీత్యా, చేసే వ్రుత్తి రీత్యా, మంచి ఆర్దిక స్తితిలో ఉంటారు ఇతరులలో కలసి పోయే , సర్దు బాటు చేసుకొనే తత్వాన్ని అలవరచు కోవాలి . మద్యలో ప్రశ్నించి వాదించడంలో సిద్ద హస్తులు .
గురువు అనుగ్రహం , దైవానుగ్రహం పెంచుకుంటే సత్కీర్తి తో జీవించ