*బిల్వవృక్షము ఎక్కడ పుట్టింది *?
*శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తూండగా,లక్ష్మిదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది.మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువు పై ఉంచాడు.
శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షంను దేవతలు స్వర్గంలోనూ, మందర పర్వతం పైన, వైకుంఠంలోనూ నాటారు.శివునికి ఇష్టమైన ఈ బిల్వవృక్ష ఆకులతో ఏరోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి.
ఎండిన, కోసి రెండు మూడు రోజులైనా శివపూజకు వాడకూడదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి.సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానం.
*ఓం నమః శివాయ*