ఒక కథ చెబుతా విను


 ఒక కథ చెబుతా విను

maruthivedicvision


    1. భగవంతుడు డు కల్పవృక్షము వంటివాడు.

   ఒకసారి ఇ దక్షిణేశ్వరం ఆలయంలో లో లో నట మందిరంలో విద్యా సుందర్ అనే నాటకం వేశారు. శ్రీ రామకృష్ణులు దాన్ని చూశారు. మరునాడు ఆ నాటకంలో వేషం వేసిన యువకుడితో ఇలా చెప్తున్నారు"భోగం ఉన్నంతవరకు యోగం ఉండదు. డబ్బు అనేది అన్నదమ్ములలో కూడా పోట్లాటలకు దారి తీస్తుంది. అప్పటివరకు ఎంతో ప్రేమతో మెలగు తున్న కుక్కలు చూడు! ఒక ఎంగిలి విస్తరి పడగానే పోట్లాడుకుంటాయి. ఎప్పుడైతే భోగం వదిలిపోతుందో అప్పుడే శాంతి లభిస్తుంది. ఒక కథ చెబుతా విను!"అంటూ అతడికి ఈ క్రింది కథను చెప్పారు.

           "ఒక బాటసారి ఎండలో నడిచి పోతున్నాడు. ఎంతో దూరం నడిచాడు. కానీ చేరవలసిన ఊరు ఇంకా రాలేదు. ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది. ఆ బాటసారి అక్కడికి పరుగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు. అప్పటికే బాగా అలిసి ఉండడంవల్ల, ఎండ వల్ల అతడికి దాహం నీళ్లు ఎక్కడైనా దొరికితే బాగుండు నే'! అనే ఆలోచన కలిగింది. అలా అనుకున్నాడు లేదో తక్షణమే అతడి ఎదుట చల్లని నీళ్ళ పాత్ర  ఒకటి ప్రత్యక్షమైంది. ఆ నీళ్లు తాగగానే అతనికి ఆకలి వేసింది. అన్నం తినాలని కోరిక మనసులో కలిగింది. తలచిందే తడవుగా రకరకాల పిండివంటలతో రుచికరమైన భోజనం ఎదుట కనపడింది. కడుపునిండా తినే సరికి, భుక్తాయాసం కలిగి పడుకుందాం అనుకున్నాడు. వెంటనే మెత్తని, చక్కని పాన్పు కళ్ళ ఎదుట తారసిల్లింది. అతగాడు దానిమీద అటు ఇటు దొర్లుతూ ఆరోజు జరిగిన విచిత్రమైన సంగతులు నెమరు వేస్తున్నాడు.'

నేను ఏది కోరుకుంటే అది కళ్ళముందు ప్రత్యక్ష అవుతుందే! చూస్తే ఇదేదో వింతగా ఉంది. ఇలాగే ఏదైనా పులి వచ్చి నన్ను  మ్రింగదు కదా'! అనుకున్నాడు. ఇంకేముంది గాండ్ రమ్మంటూ ఒక పెద్దపులి వచ్చి అతడి గొంతు కొరికి చంపేసింది."చూసావా! ఆ చెట్టు మరి ఏమిటో కాదు, అదే కల్పవృక్షము! కల్పవృక్షము ఏది కోరితే దాన్ని ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షము వంటివాడు. ఆ కల్పవృక్షము నీడలో నిలబడి ఏది కోరితే అది తప్పకుండా సిద్ధిస్తుంది".

              ఈ కథ వింటున్న ఆ నటుడు," మహా ప్రభువు! భోగాన్ని గురించి మీరు చెప్పిందంతా పరమ సత్యం. భగవంతుణ్ని భోగాలు కావాలని ప్రార్థిస్తే చివరకు మిగిలేది అనర్థమే. మనస్సులోకి అనేక ఆలోచనలు, కోరికలు వస్తుంటాయి. అవన్నీ మంచివి కావు కదా! భగవంతుడు కల్పవృక్షము వంటి వాడు! మీరు చెప్పిన కథలో లాగా, 'పెద్దపులి వస్తుందేమో'అనుకుంటే నిజంగానే పులి వచ్చి అతన్ని మ్రింగి వేసింది"అన్నాడు. వెంటనే గురుదేవులు,"నిజమే! భోగభాగ్యాలు కావాలని కోరితే వాటి వెనుక నే పెద్దపులి కూడా వస్తుందన్న విషయము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో! నేను నీకు అంతకంటే ఏమి చెప్పేది? భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీకు సాక్షాత్కరిస్తాడు"బోధించారు.

 ఈ విషయాన్ని గురుదేవులు శశిధర పండితుడికి, నంద బోసు అనే ఒక సంపన్న గృహస్థుడుకి కూడా చెప్పారు."జ్ఞానులు ముక్తి కావాలని, భక్తులు భక్తి కావాలని, ఏ మాత్రమైనా ఫలాపేక్ష లేనటువంటి ప్రేమ అ కావాలని కోరుకుంటారు కానీ అర్థ కామాలు (కామిని కాంచన లు) కావాలని ఎప్పుడు కోరారు"అని కూడా వారితో చెప్పారు.