ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
ఆత్మ అంటే నేను అని సంస్కృతంలో అర్థం. ఈ ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు శరీర ధర్మాలన్ని ఆత్మకి వర్తిస్తాయి. మనం ఏ గృహంలో నివసిస్తున్నామో,ఆ గృహం యొక్క ప్రభావం మన మీద పడుతుందో, అలాగా పరమాత్మ నుండి వచ్చిన జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు ,ఈ దేహం యొక్క ప్రభావం, పరిస్థితులు దానిపై ప్రసరిస్తాయి. దీనినే ఆత్మ ధర్మం అంటారు. ఈ ఆత్మ సామాన్యంగా గత జన్మ సంస్కారాన్ని బట్టి అది శిష్టాచారంగా, లేదా దురాచారంగా కూడా పరిణమిస్తుంది. మనసు, బుద్ధి, ఇంద్రియముల ప్రభావం దేహంపైన ఉంటుందో అదే విధంగా దేహి పై కూడా ఉంటుంది. తన బుద్ధి, తన జ్ఞానేంద్రియాలు, తన కర్మేంద్రియాలు వీటికి సంబంధించిన వ్యవహారాన్ని ఆత్మికత అంటారు. అధి అంటే దానికి సంబంధించిన వ్యవహారాలను అన్నింటిని ఆ ఆధ్యాత్మికత అంటారు. ఇంకా ఈ ఆత్మ భగవంతుని నుండి వచ్చింది గనక, పరమైన ఆత్మ అంశ జీవుని లో ఉంది కనక ఆ పరమాత్మ తత్వం జీవాత్మ పై కూడా ఉంటుంది. అందుచేత భగవంతునికి సంబంధించిన విషయాలు ,భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత లోని భాగాలు. అంటే ఇదే హి దేహంలో ఉన్నంత వరకు దేహాన్ని పోషించాలి, రక్షించుకోవాలి. ఆత్మకు సంబంధించిన విషయం కనక ఆధ్యాత్మికత అయింది.
ఆధ్యాత్మికతలో జీవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటాడు.
మన గురించి మనం ఆలోచన చేయడం. లోలోన ఆలోచన పెంచుకోవడం, ప్రాపంచికమైన సంబంధాలన తుం చుకోవడం, బంధాలను పెంచుకో కపోవడం, ఆనందాన్ని పంచుకు పెంచుకోవడం ఇది ఆధ్యాత్మికత.