home


తెలుగు పంచాంగము

 మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగం అని పిలుస్తారు. హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం (తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు) లెక్కించ బడుతుంది. ప్రతిరోజు చేసే సంకల్పంనుంచి, పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు తదితర కార్యక్రమాలకు, శ్రాద్ధాది పితృ సంబంధ కార్యక్రమాలకు, అన్ని రకాల శుభాశుభాలకు, వివాహాది శుభకార్యాలకు ముహూర్తం చూడటానికి పంచాంగం తప్పనిసరైన అంశం.

ఇక్కడ ఇవ్వబడిన పంచాంగదర్శిని ద్వారా మీరు ఏ రోజుకైనా, ఏ ప్రదేశానికైనా పంచాంగాన్ని తెలుసుకోవచ్చు. దీనిలో సూర్య/ చంద్రుల ఉదయాస్తమయాలు, సూర్య చంద్రుల రాశి స్థితి, కలియుగ సంవత్సరాలు, శాలివాహన శక సంవత్సరం, విక్రమ శకం, కలియుగ గత దినములు, జూలియన్ దినములు, హిందూ సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణముల అంత్య సమయములు, అమృత ఘడియలు, రాహు కాలం, గుళికా కాలం, యమగండ కాలం, దుర్ముహూర్తం, వర్జ్యం, దిన విభాగములు, రాత్రి విభాగములు, చౌగడియలు/ గౌరీ పంచాంగము, హోరా సమయములు, దిన ముహూర్తములు, పంచాంగ శుభాశుభ విషయములు, చేయదగిన పనులు, తారాబలం, చంద్రబలం మొదలైన అంశాలు తెలుసుకోవచ్చు.


పంచంగం అంటే ఏమిటి?

తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం ("పంచ"-"అంగం"). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది)
మీ జన్మ నక్షత్రం, రాశి, జన్మ నామము, జన్మ తిథి, తదితర పంచాంగ వివరములు, లగ్న కుండలి, నవాంశ కుండలితో పాటు 16 వర్గ కుండలిలు, అవకహడ చక్రము, ఘాత చక్రము, అదృష్ట అంశములు (జాతకరీత్యా అనుకూల సంఖ్యలతో) , గ్రహ బలములు, భావ బలములు, గ్రహదృష్టులు, వింశోత్తరి దశాంతర్దశా పట్టికలు, ద్విగ్రహ, త్రిగ్రహ యోగములు, ఇతర యోగములు, రాజయోగములు, కుజదోషము, కాలసర్ప దోషము (వివరములు, ఫలితములు మరియు దోష పరిహారములు), లగ్న ఫలితములు, గ్రహస్థితి ఫలితములు, దశాంతర్దశా ఫలితములు పొందవచ్చు.

No comments:

Post a Comment